PBKS vs RR: జోస్ బట్లర్ స్టన్నింగ్ క్యాచ్.. సింగిల్ హ్యాండ్‌తో ధావన్‌కు చెక్! (వీడియో)

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్న రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్.. ఫీల్డింగ్‌లోనూ దుమ్మురేపుతున్నాడు. ఇప్పటికే లీగ్‌లో మూడేసి సెంచరీలు, హాఫ్ సెంచరీలు బాదిన ఈ ఇంగ్లండ్ వికెట్ కీపర్.. 588 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జోస్ బట్లర్.. స్టన్నింగ్ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. గాల్లోకి ఎగురుతూ సింగిల్ హ్యాండ్‌తో పట్టిన క్యాచ్.. మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఐపీఎల్ 2022 సీజన్ బెస్ట్ క్యాచ్‌ల్లో ఇది టాప్‌లో నిలవనుంది. ప్రస్తుతం ఈ స్టన్నింగ్ క్యాచ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
అసలేం జరిగిందంటే..?
టాస్ గెలిచి పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్‌కు దిగగా.. పంజాబ్ ఓపెనర్లు జానీ బెయిర్ స్టో, శిఖర్ ధావన్ శుభారంభం అందించారు. ధావన్ నిదానంగా ఆడిన బెయిర్ స్టో ధాటిగా ఆడుతూ వేగంగా పరుగులు రాబట్టాడు. ఈ జోడీని విడదీసేందుకు సంజూ శాంసన్.. అశ్విన్‌ను రంగంలోకి దించాడు. ఇక తమ కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అశ్విన్ తొలి బంతికే రాజస్థాన్‌కు మంచి బ్రేక్ త్రూ అందించాడు. అతను వేసిన మొదటి బంతిని ధావన్ ఓవర్ మిడాన్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే ఆ దిశలో సర్కిల్‌పై ఫీల్డింగ్ చేస్తున్న జోస్ బట్లర్ అద్భుతంగా గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు.
బట్లర్‌ను ధాటితే..
బట్లర్ అసాధారణ క్యాచ్‌తో శిఖర్ ధావన్(16 బంతుల్లో 2 ఫోర్లతో 12) నిరాశగా పెవిలియన్ చేరాడు. బట్లర్‌కు ఆ బంతి దొరకకుండా ఉంటే అది బౌండరీకి దూసుకెళ్లేది. ధావన్ ఔటవ్వడంతో తొలి వికెట్‌కు నమోదైన 47 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి రాజపక్స రాగా.. వికెట్ నష్టానికి 48 పరుగులు చేసి పంజాబ్ పవర్ ప్లేను ముగించింది. ఆ తర్వాత రాజపక్స, బెయిర్ స్టో ధాటిగా ఆడారు. భారీ షాట్ ప్రయత్నంలో రాజపక్స(18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27) చాహల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఫ్యాన్స్ ఫిదా..
ఇక జోస్ బట్లర్ సూపర్ క్యాచ్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. వాటే క్యాచ్, బట్లర్ ఒక్కడే ఏదైనా చేయగలడంటూ ప్రశంసిస్తున్నారు. క్రికెట్‌లో సూపర్ మ్యాన్ ఎవరో తెలిసిపోయింది, అతను జోస్ బట్లరేనని కామెంట్ చేస్తున్నారు. జోస్ క్యాచ్‌ను ఉద్దేశిస్తూ సొంత ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ అడ్మిన్ కూడా సెటైర్లు పేల్చాడు. ఇలా క్యాచ్‌లు పట్టడం చట్టరీత్యా నేరమని కామెంట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications