ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్(45 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 67), రియాన్ పరాగ్(25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 205 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్(26 బంతుల్లో 6 ఫోర్లతో 38), షిమ్రాన్ హెట్‌మైర్(12 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 20) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
పంజాబ్ కింగ్స్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్(2/37) రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, మార్కో జాన్సెన్ తలో వికెట్ పడగొట్టారు. చివరి నాలుగు ఓవర్లలోనే 55 పరుగులు రావడంతో రాజస్థాన్ రాయల్స్ 205 పరుగులు చేయగలిగింది. మార్కో జాన్సెన్, మార్కో స్టోయినీస్ ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు.

అదిరిపోయే ఆరంభం..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ దూకుడుగా ఆడటంతో రాజస్థాన్ పవర్ ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. అనంతరం మరింత దూకుడుగా ఆడిన ఈ జోడీ వేగంగా పరుగులు చేసింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ఫెర్గూసన్ విడదీసాడు. సంజూ శాంసన్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 89 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. యుజ్వేంద్ర చాహల్ వేసిన 12వ ఓవర్ ఐదో బంతిని యశస్వి జైస్వాల్ లాంగాఫ్ దిశగా బౌండరీ బాది 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
పరాగ్ విధ్వంసం..
మరో ఎండ్‌లో రియాన్ పరాగ్ కూడా చెలరేగడంతో వేగంగా పరుగులు వచ్చాయి. అయితే సెంచరీ దిశగా సాగిన యశస్వి జైస్వాల్‌ను లాకీ ఫెర్గూసన్ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన నితీష్ రాణా(12) తీవ్రంగా నిరాశపరిచాడు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదిన అతను.. మార్కో జాన్సెన్ వేసిన మరుసటి ఓవర్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో షిమ్రాన్ హెట్‌మైర్‌తో కలిసి రియాన్ పరాగ్ వేగంగా పరుగులు చేశాడు.
మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో పరాగ్ వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. ఆ మరుసటి బంతికే అతను ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను జాన్సెన్ నేలపాలు చేశాడు. మరో ఎండ్‌లో దూకుడుగా ఆడుతున్న హెట్‌మైర్‌ను అర్ష్‌దీప్ సింగ్ పెవిలియన్ చేర్చాడు. ఆఖరి ఓవర్‌లో ధ్రువ్ జురెల్ రెండు సిక్స్‌లతో పాటు ఓ బౌండరీ బాది జట్టు స్కోర్‌ను 200 ధాటించాడు.