ఏబీడీ డకౌట్..
ఆర్‌సీబీ vs కేకేఆర్ మ్యాచ్ విషయంలోనూ గంభీర్ అంచనా రివర్సైంది.ఇదే స్టార్ స్పోర్ట్స్ 'గేమ్ ప్లాన్' షోలో మాట్లాడిన గంభీర్.. కోల్‌కతాపై విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్‌కు మంచి రికార్డు ఉందని, అతనే ఈ మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు బాదుతాడని చెప్పుకొచ్చాడు. తీరా మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆండ్రీ రస్సెల్ వేసిన పదునైన యార్కర్‌కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఏబీ డివిలియర్స్ ఫస్టాఫ్ లీగ్ మాదిరి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడుతారని ఆర్‌సీబీ అభిమానులు భావించారు. కానీ ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో రస్సెల్ వేసిన యార్కర్.. ఏబీడీ లెగ్ సైడ్ పాదాల వద్ద పడి బ్యాట్‌ను మిస్సవుతూ వికెట్లను గిరాటేసింది. తాజాగా పంజాబ్ కూడా ఓడిపోవ్వడంతో గంభీర్‌పై అభిమానులు సెటైర్లు పేల్చుతున్నారు.
ఏం దరిద్రపు నోరయ్యా..
ఇక మొన్న ఏబీడీ డకౌటవ్వడానికి.. నిన్న గెలిచే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓడిపోవడానికి గౌతమ్ గంభీరే కారణమని ఆరోపిస్తూ.. అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. 'గంభీర్ ఏం దరిద్రపు నోరయ్యా నీది.. సిక్స్‌లన్నావ్.. ఏబీడీ గోల్డెన్ డౌకటయ్యాడు. పంజాబ్ సునాయస విజయమన్నావ్.. గెలిచే మ్యాచ్‌లో ఓడింది'అని కామెంట్ చేస్తున్నారు.
కోల్‌కతాకు వీడ్కోలు పలికినా గంభీర్ ఆ జట్టు తరఫున ఆడుతూనే ఉన్నాడని సెటైర్లు పేల్చుతున్నారు. గంభీర్ అంచనాలు ఏవి నిజం కావని, గతంలో చాలాసార్లు ఈ విషయం నిరూపితమైందని పేర్కొంటున్నారు. ఢిల్లీ, సన్‌రైజర్స్ మ్యాచ్‌కు అంచనా వేయకని సూచిస్తున్నారు.
గంభీర్‌కు రివర్స్ వేయండి..
ఇక బెట్టింగ్ రాయుళ్లు గౌతమ్ గంభీర్‌ను ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు. అతను చెప్పినదానికి రివర్స్ జరుగుతుందని, అందుకే రివర్స్ బెట్టింగ్ వేయాలని సలహాలిస్తున్నారు. కొందరైతే గంభీర్ ఏదీ మాట్లాడకపోవడం మంచిదంటున్నారు. అవకాశం దొరికితే కోహ్లీ, ధోనీపై ఏడ్వడం గంభీర్‌కు అలవాటని విమర్శిస్తున్నారు. ఆ గేమ్ ప్లాన్‌షోకు గంభీర్ వెల్లడమే దండుగనని కామెంట్ చేస్తున్నారు. గతంలో కూడా గంభీర్ చెప్పింది ఏదీ జరగలేదన్నారు. ఈ సెటైర్లు ఫన్నీ మీమ్స్‌తో ప్రస్తుతం గంభీర్ హ్యాష్ ట్యాగ్ గత రెండు రోజులుగా ట్రెండ్ అవుతోంది.
చివరి రెండు ఓవర్లలో..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 49), మహిపాల్ లోమ్రోర్ (17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 43), ఎవిన్ లూయిస్ (21 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 36) కీలక ఇన్నింగ్స్ ఆడారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ (5/32) ఐదు వికెట్లతో దుమ్మురేపాడు.
అనంతరం చేజింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 183 పరుగులకే పరిమితమైంది. కేఎల్ రాహుల్ రాహుల్ (33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 49), మయాంక్ అగర్వాల్ (43 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతో 67)రాణించినా ఫలితం లేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో కార్తీక్ త్యాగి రెండు వికెట్లు తీయగా.. చేతన్ సకారియా, రాహుల్ తెవాటియా చెరొక వికెట్ పడగొట్టారు. ముఖ్యంగా ముస్తాఫిజుర్ వేసిన 19వ ఓవర్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అవ్వగా.. ఆఖరి ఓవర్‌లో కార్తీక్ త్యాగి అద్భుతం చేశాడు. రెండు వికెట్లు తీయడంతో పాటు ఒకే ఒక పరుగు ఇచ్చాడు.


Click it and Unblock the Notifications
