Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs RCB: అతని కోసమే లివింగ్ స్టోన్‌ను తప్పించాం: రజత్ పటీదార్

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ తెలిపాడు. పిచ్ చూడటానికి బాగుందన్నాడు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగా లియామ్ లివింగ్ స్టోన్‌ను తప్పించి రోమారియో షెఫెర్డ్‌ను తీసుకున్నామని తెలిపాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ చూడటానికి బాగుంది. వికెట్‌లో పెద్దగా మార్పు ఉండదు. సెకండ్ బ్యాటింగ్ చేస్తే.. వికెట్ గురించి, గేమ్ గురించి ఓ అవగాహన వస్తుంది. మేం వేదికలను చూడటం లేదు. మంచి క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నాం. లివింగ్ స్టోన్ స్థానంలో రోమారియో షెఫెర్డ్ జట్టులోకి వచ్చాడు.'అని రజత్ పటీదార్‌కు చెప్పుకొచ్చాడు.

PBKS vs RCB Rajat Patidar Reveals The Reason Why Liam Livingstone Not Playing Vs PBKS

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. 'మేం కూడా బౌలింగ్ ఎంచుకోవాళ్లనుకున్నాం. ఏది ఏమైనా పరిస్థితులను అందిపుచ్చుకొని ఆడటం చాలా ముఖ్యం. కాస్త టైమ్ తీసుకొని బంతి ఎలా మూవ్ అవుతుందో గమనించి ఆడాలి. మేం ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే. మేం బోర్డుపై మంచి లక్ష్యం నమోదు చేస్తామని ఆశిస్తున్నా. ప్రేక్షకుల నుంచి లభిస్తున్న మద్దతు అద్భుతం. ముఖ్యంగా ఇక్కడ జరిగిన గత మ్యాచ్‌కు ప్రేక్షకులు భారీ సంఖ్యలో హారయ్యారు. ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నాం.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (సి), జోష్ ఇంగ్లిస్ (w), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

ఆర్‌సీబీ: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(సి), జితేష్ శర్మ(కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్.

Story first published: Sunday, April 20, 2025, 15:20 [IST]
Other articles published on Apr 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+