ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ అన్నాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ చూడటానికి చాలా కఠినంగా కనిపిస్తోంది. పిచ్ పూర్తిగా గడ్డితో కవర్ చేసింది ఉంది. వీలైనంత వరకు ఆరంభ ఓవర్లలోనే ఈ అడ్వాంటేజ్‌ను వాడుకోవడానికి ప్రయత్నిస్తాం. గత మ్యాచ్‌లో ప్రతీ ఒక్కరు 100 శాతం కంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టారు. జితేశ్, సాల్ట్, కోహ్లీ అసాధారణ ప్రదర్శన కనబర్చారు. తుది జట్టులో ఒక మార్పు చేశాం. నువాన్ తుషారా స్థానంలో హజెల్ వుడ్ తిరిగొచ్చాడు.'అని రజత్ పటీదార్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు టాస్ గెలిచినా తాము ముందుగా బ్యాటింగ్ చేసేవాళ్లమని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. 'మేం ముందుగా బ్యాటింగే చేయాలనుకున్నాం. ఇక్కడి రికార్డ్స్ ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లకే అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మాకు విజయం దక్కుతుందనే ఆశతో ఉన్నాను. ప్రేక్షకుల నుంచి మద్దతు అవసరం. వారి అరుపులు మాకు శక్తినిస్తాయి. మా ఓపెనర్ల ఫియర్‌లెస్ గేమ్ అద్భుతం. మార్కో జాన్సెన్ స్థానంలో అజ్మతుల్లా ఆడుతున్నాడు.'అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.

తుది జట్లు:
పంజాబ్ కింగ్స్: ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్(కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, కైల్ జేమీసన్
ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ.