Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: జితేశ్ శర్మ కళ్లు చెదిరే క్యాచ్.. పోలా అదిరిపోలా!(వీడియో)

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వికెట్ కీపర్ జితేష్ శర్మ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. వికెట్ల వెనుకాల సూపర్ మ్యాన్‌లా గాల్లో ఎగురుతూ సింగిల్ హ్యాండ్‌తో అందుకున్న ఈ క్యాచ్‌ మైదానంలోని ఆటగాళ్లు, అభిమానులతో పాటు టీవీల ముందున్న ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్యాచ్‌ను చూసిన నెటిజన్లు 'బాప్‌రే.. వాటే క్యాచ్'.. జితేశ్ శర్మ సింగిల్ హ్యాండ్ క్యాచ్ పోలా అదిరిపోలా అని కామెంట్ చేస్తున్నారు. ఈ సీజన్‌లోనే ఇది అత్యుత్తమ క్యాచ్‌గా నిలుస్తుందని కూడా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

జోష్ హజెల్ వుడ్ వేసిన 15 ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతికి అజ్మతుల్లా ఒమర్జాయ్ ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్‌ లైన్‌లో వేసిన లెంగ్త్ డెలివరీని ఒమర్జాయ్ భారీ షాట్‌గా మలిచే ప్రయత్నం చేశాడు. బ్యాట్‌ను గట్టిగా ఊపడంతో బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్ కీపర్ కుడివైపు నుంచి ఎత్తులో దూసుకెళ్లింది. కానీ వెంటనే అప్రమత్తమైన జితేశ్ శర్మ గాల్లోకి ఎగిరి సింగిల్ హ్యాండ్‌తో అద్భుతంగా అందుకున్నాడు.

PBKS vs RCB Qualifier 1 Jitesh Sharma takes Stunning high catch to dismiss Azmatullah Omarzai
Photo Credit: screen grab for JioHotstar

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ పంజాబ్ కింగ్స్ 14.1 ఓవర్లలో 101 పరుగులకు కుప్పకూలింది. పంజాబ్ బ్యాటర్లలో మార్కస్ స్టోయినీస్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26) మినహా అంతా విఫలమయ్యారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య(7), ప్రభ్ సిమ్రాన్ సింగ్(18)తో పాటు జోష్ ఇంగ్లీస్(4), శ్రేయస్ అయ్యర్(2), నెహాల్ వధేరా(8) తీవ్రంగా నిరాశపరిచారు. ఆర్‌సీబీ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(3/21), సుయాశ్ శర్మ(3/17) మూడేసి వికెట్లు తీయగా.. యశ్ దయాల్(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్, రొమారియో షెపెర్డ్‌కు చెరో వికెట్ దక్కింది.

Story first published: Thursday, May 29, 2025, 21:52 [IST]
Other articles published on May 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+