Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs RCB: ఎవడ్రా కోహ్లీ ఫెయిల్యూర్ కెప్టెన్ అన్నది? కుట్రతో తప్పించారు గానీ..!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మూడో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 24 పరుగుల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ మాత్రమే చేయగా.. విరాట్ కోహ్లీ తాత్కలిక సారథిగా జట్టును నడిపించాడు.

556 రోజుల తర్వాత కోహ్లీ ఆర్‌సీబీ కెప్టెన్‌గా బరిలోకి దిగాడు. గతేడాదే టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను వదిలేసిన కోహ్లీ.. ఆర్‌సీబీ సారథ్యాన్ని కూడా వదులుకున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత మళ్లీ ఇప్పుడే కోహ్లీ ఆర్‌సీబీ జట్టును నడిపించాడు. సూపర్ కెప్టెన్సీతో జట్టుకు అద్భుత విజయాన్నందించాడు.

kohli

పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు బ్యాటింగ్ చేయడంతో పాటు మైదానంలో అద్భుత నిర్ణయాలతో జట్టు విజయానికి బాటలు వేసాడు. పరిస్థితులకు తగ్గట్లు ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్‌తో పాటు బౌలింగ్ మార్పులతో ఫలితాన్ని రాబట్టాడు. పంజాబ్ ఇన్నింగ్స్ సందర్భంగా మూడో ఓవర్‌నే స్పిన్నర్ వానిందు హసరంగాతో వేయించి ధాటిగా ఆడుతున్న షార్ట్స్ వికెట్ రాబట్టాడు. మూడు రివ్యూలను సక్సెస్‌పుల్‌గా ఉపయోగించుకున్నాడు.

టీమ్ మోరల్ దెబ్బతినకుండా ఎప్పటికప్పుడూ ఆటగాళ్లతో మాట్లాడుతూ మోటీవేట్ చేశాడు. బంతులను డాట్స్ చేయడం, పరుగులు ఆపడం కాదని, వికెట్లే లక్ష్యంగా బౌలింగ్ చేయాలని పదే పదే చెప్పి ఆశించిన ఫలితాన్ని అందుకున్నాడు. బ్యాటింగ్‌లో ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి తొలి వికెట్‌కు 137పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన కోహ్లీ.. ఐపీఎల్‌లో 100 సార్లు 30+ స్కోర్లు చేశాడు. టోర్నీ చరిత్రలో 600 ఫోర్లు బాదాడు.

kohli

కోహ్లీ కెప్టెన్సీకి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఎవడ్రా కోహ్లీ ఫెయిల్యూర్ కెప్టెన్? అన్నది అని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. కుట్రతో కింగ్ కోహ్లీని సారథ్య బాధ్యతల నుంచి తప్పించారని, అతన్ని మించిన సారథి లేడని పరోక్షంగా రోహిత్ శర్మపై విమర్శలు గుప్పించారు. సరైన టీమ్ ఎంపిక చేయకుండా అనవసర నిర్ణయాలతో కోహ్లీని బద్నాం చేశారని, అతను గొప్ప కెప్టెన్ అని మండిపడుతున్నారు.

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తాజా మ్యాచే కోహ్లీ కెప్టెన్సీ సత్తాకు నిదర్శనమని కొనియాడుతున్నారు. సరైన టీమ్ లేకుండా కేవలం బ్యాటింగ్‌తోనే 2016లో ఆర్‌సీబీని ఫైనల్‌కు తీసుకెళ్లాడని గుర్తు చేస్తున్నారు. సూపర్ టీమ్‌తో ఐదు టైటిళ్లు గెలిచిన బెస్ట్ కెప్టెన్ గతేడాది ఎందుకు గెలవలేదని ప్రశ్నిస్తున్నారు.

కుట్రపూరితంగానే కోహ్లీని సారథ్య బాధ్యతల నుంచి తప్పించారని, అయినా తన ఆటతో క్రికెట్ ప్రపంచాన్ని అలరిస్తూనే ఉన్నాడని కోహ్లీ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Story first published: Friday, April 21, 2023, 6:00 [IST]
Other articles published on Apr 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+