For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 193 పరుగులు భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. సూర్యకుమార్ యాదవ్(53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 78) విధ్వంసకర బ్యాటింగ్‌తో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు చేసింది.

రోహిత్ శర్మ(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36), తిలక్ వర్మ(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33 నాటౌట్) మెరుపులు మెరిపించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు, సామ్ కరణ్ రెండు వికెట్లు తీయగా.. కగిసో రబడా ఓ వికెట్ పడగొట్టాడు.

PBKS vs MI Suryakumar Yadav and Tilak Varma Helps Mumbai post 192 7

శుభారంభం లేదు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్(8) తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి రోహిత్ శర్మ చెలరేగాడు. దాంతో పవర్ ప్లేలో ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది.

PBKS vs MI Suryakumar Yadav and Tilak Varma Helps Mumbai post 192 7

సూర్య విధ్వంసం..
అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని సామ్ కరణ్ విడదీసాడు. హాఫ్ సెంచరీకి చేరువైన రోహిత్ శర్మను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి తిలక్ వర్మ రాగా.. సూర్యకుమార్ యాదవ్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

PBKS vs MI Suryakumar Yadav and Tilak Varma Helps Mumbai post 192 7

తిలక్ వర్మ మెరుపులు...
నిలకడగా ఆడిన ఈ ఇద్దరూ జట్టును భారీ స్కోర్ దిశగా నడిపారు. సెంచరీ దిశగా నడిచిన సూర్యకుమార్ యాదవ్ సామ్ కరణ్ ఔట్ చేయడంతో మూడో వికెట్‌కు నమోదైన 49 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(10), టీమ్ డేవిడ్(14), రోమారియో షెఫర్డ్ విఫలమవ్వగా.. తిలక్ వర్మ ధాటిగా ఆడి జట్టుకు భారీ స్కోర్ అందించాడు.

Story first published: Thursday, April 18, 2024, 21:34 [IST]
Other articles published on Apr 18, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+