Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌‌‌లో కొనసాగుతున్నఛేజింగ్‌ ట్రెండ్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పంజాబ్ కింగ్స్ తాత్కలిక సారథి సామ్ కరణ్ తెలిపాడు. రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఈ మ్యాచ్‌కు కూడా దూరమవడంతో వైస్ కెప్టెన్ అయిన సామ్ కరణ్ జట్టును నడిపిస్తున్నాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. టోర్నీలో కొనసాగుతున్న ఛేజింగ్‌ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాం. శిఖర్ ధావన్ ఇంకా కోలుకోలేదు. జానీ బెయిర్ స్టో స్థానంలో రిలీ రోసౌ జట్టులోకి వచ్చాడు. గత రెండు మ్యాచ్‌లను మేం తృటిలో చేజార్చుకున్నాం. ఆ మ్యాచ్‌ల్లో చేసిన తప్పిదాలను సరిచేసుకున్నాం. టైడ్‌ను పక్కనపెట్టాం. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే జట్టులో వ్యూహాత్మక మార్పులు చేశాం.'అని సామ్ కరణ్ చెప్పుకొచ్చాడు.

PBKS vs MI Sam Curran says Rilee comes in for Jonny and Taide drops out

మరోవైపు టాస్ గెలిచినా తాము ముందుగా బ్యాటింగ్ చేసేవాళ్లమని ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా తెలిపాడు. టాస్ ఓడినా తమకు కావాల్సిందే దక్కిందన్నాడు. 'మా ప్రదర్శన ఆధారంగా మా జట్టుపై ఓ నిర్ణయానికి రావడం లేదు. గెలిచే మ్యాచ్‌ల్లో మేం ఓటమిపాలయ్యాం. ఐపీఎల్ ఆటగాళ్ల సత్తాకు పరీక్ష పెడుతోంది.

ఆఖరి బంతి వరకు మ్యాచ్ ఫలితం తేలదు. మేం ఒక్కో మ్యాచ్ గెలుస్తూ ముందుకు సాగుతాం. 100 శాతం జట్టు గెలుపు కోసం ప్రయత్నిస్తాం. ప్రతీ ఒక్కరు టీమ్ లక్ష్యం కోసం ఆడాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి మా ఆటగాళ్లు చెలరేగితే ఫలితాలు మాకు అనుకూలంగా ఉంటాయి. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాం.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టీమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, మహమ్మద్ నబీ, గెరాల్డ్ కోయిట్జీ, శ్రేయస్ గోపాల్, జస్‌ప్రీత్ బుమ్రా

పంజాబ్ కింగ్స్: రిలీ రోసౌ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కరణ్, జితేశ్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, అషుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడా, అర్ష్‌దీప్ సింగ్

Story first published: Thursday, April 18, 2024, 19:27 [IST]
Other articles published on Apr 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+