ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, టీమిండియా సారథి రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో 250వ మ్యాచ్ ఆడిన రోహిత్ శర్మ.. ఈ ఘనతను అందుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌తో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో మూడు సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ.. ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ మాజీ ప్లేయర్ కీరన్ పోలార్డ్(223 సిక్సర్లు) రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ(224) టాప్‌లో ఉండగా.. కీరన్ పొలార్డ్(223), హార్దిక్ పాండ్యా(104), ఇషాన్ కిషన్(103), సూర్యకుమార్ యాదవ్(97) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ అత్యధికంగా 357 సిక్సర్లు కొట్టగా.. రోహిత్ శర్మ 275 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో 6500 పరుగుల మైలురాయి అందుకున్న రోహిత్ శర్మ.. ఈ ఘనతను అందుకున్న నాలుగో ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. రోహిత్ శర్మ కన్నా ముందు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ ఈ ఫీట్ సాధించారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 78) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. రోహిత్ శర్మ(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36), తిలక్ వర్మ(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33 నాటౌట్) మెరుపులు మెరిపించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు, సామ్ కరణ్ రెండు వికెట్లు తీయగా.. కగిసో రబడా ఓ వికెట్ పడగొట్టాడు.