Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs MI: తెలుగోడి విన్నింగ్ సిక్స్.. పంజాబ్‌పై ప్రతీకారం తీర్చుకున్న రోహిత్ సేన!

మొహాలీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్నందుకుంది. పంజాబ్ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సూపర్ బ్యాటింగ్‌తో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇషాన్ కిషన్(41 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 75), సూర్యకుమార్ యాదవ్(31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీలతో చెలరేగి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించారు. అర్ష్‌దీప్ సింగ్(1/66) బౌలింగ్ వైఫల్యం పంజాబ్ కింగ్స్ విజయవకాశాలను దెబ్బతీసింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. లియామ్ లివింగ్ స్టోన్(42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 నాటౌట్), జితేశ్ శర్మ(27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 49 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా.. అర్షద్ ఖాన్ ఓ వికెట్ తీసారు.

Tilak Varma Mumbai Indians
Photo Credit:

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 216 పరుగులు చేసి గెలుపొందింది. ఇషాన్ కిషన్, సూర్య సూపర్ బ్యాటింగ్‌కు టీమ్ డేవిడ్(19 నాటౌట్), తిలక్ వర్మ(26 నాటౌట్) మెరుపులు మెరిపించారు. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, రిషి ధావన్ తలో వికెట్ పడగొట్టారు.

కెప్టెన్ రోహిత్ శర్మ(0), కామెరూన్ గ్రీన్(23) విఫలమైనా.. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ అదిరపోయే బ్యాటింగ్‌తో విజయానికి బాటలు వేసారు. చివర్లో ఈ ఇద్దరు ఔటైనా.. తెలుగు తేజం తిలక్ వర్మ విన్నింగ్ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఈ సీజన్ ఫస్టాఫ్‌లో ఎదురైన ఓటమికి.. తాజా విజయంతో ముంబై బదులు తీర్చుకుంది.

కెప్టెన్ రోహిత్ శర్మ(0) విఫలమైనా.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్.. కామెరూన్ గ్రీన్(23)‌తో కలిసి చెలరేగాడు. 54 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని నాథన్ ఎల్లిస్ విడదీసాడు. దాంతో ముంబై పవర్ ప్లేలో 2 వికెట్లకు 54 పరుగులు చేసింది. క్రీజులోకి వచ్చిన సూర్యతో కలిసి ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడాడు.

29 బంతుల్లోనే ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. మరోవైపు సూర్య తనదైన షాట్లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మూడో వికెట్‌కు 124 పరుగులు జోడించిన అనంతరం సూర్యను ఎల్లిస్ ఔట్ చేయగా.. ఆ వెంటనే ఇషాన్ కిషన్‌ను అర్ష్‌దీప్ సింగ్ పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన టీమ్ డేవిడ్, తిలక్ వర్మ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

తెలుగు తేజం తిలక్ వర్మ విన్నింగ్ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఈ సీజన్ ఫస్టాఫ్‌లో ఎదురైన ఓటమికి.. తాజా విజయంతో ముంబై బదులు తీర్చుకుంది.

Story first published: Wednesday, May 3, 2023, 23:22 [IST]
Other articles published on May 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+