Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs MI: తొండాటకు ముగింపు.. కెమెరా ముందు టాస్ కాయిన్ ఫలితం! (వీడియో)

ఐపీఎల్ 2024 సీజన్‌లో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. టాస్ ఫలితాన్ని టీవీ కెమెరాలకు చూపించడం మొదలుపెట్టారు. ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్‌సీబీ మ్యా‌చ్‌లో టాస్ ఫలితాన్ని తారుమారు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కాయిన్‌ను ఫ్లిప్ చేయగా.. అది దూరం పడింది. మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ కాయిన్ తీసే సమయంలో ఫ్లిప్ చేసి ముంబైకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగింది. ఆ మ్యాచ్‌ ఫలితంలో టాస్ కీలక పాత్ర పోషించడంతో మరిన్ని విమర్శలు వచ్చాయి. ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ సైతం ఈ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

PBKS vs MI Broadcaster zooms into coin after unnecessary IPL toss controversy

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు హార్దిక్ పాండ్యా చేసిన మోసాన్ని వివరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ విమర్శల నేపథ్యంలోనే టాస్ ఫలితాన్ని కెమెరాలకు చూపించాలని ఐపీఎల్ అధికారులు నిర్ణయించారు. పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న తాజా మ్యాచ్‌తోనే ఈ నిర్ణయాన్ని అమలు చేశారు. సామ్ కరణ్ కాయిన్ ఫ్లిప్ చేయగా.. టాస్ ఫలితాన్ని కెమెరాల్లో చూపించారు.

ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌‌‌లో కొనసాగుతున్నఛేజింగ్‌ ట్రెండ్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పంజాబ్ కింగ్స్ తాత్కలిక సారథి సామ్ కరణ్ తెలిపాడు. రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఈ మ్యాచ్‌కు కూడా దూరమవడంతో వైస్ కెప్టెన్ అయిన సామ్ కరణ్ జట్టును నడిపిస్తున్నాడు.

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టీమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, మహమ్మద్ నబీ, గెరాల్డ్ కోయిట్జీ, శ్రేయస్ గోపాల్, జస్‌ప్రీత్ బుమ్రా

పంజాబ్ కింగ్స్: రిలీ రోసౌ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కరణ్, జితేశ్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, అషుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడా, అర్ష్‌దీప్ సింగ్

Story first published: Thursday, April 18, 2024, 20:27 [IST]
Other articles published on Apr 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+