
పుణే: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ స్టార్ పేసర్ కగిసో రబడా(4/38) నాలుగు వికెట్లతో చెలరేగాడు. దాంతో లక్నో సూపర్ జెయింట్స్.. పంజాబ్ ముందు 154 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు చేసింది.
క్వింటన్ డికాక్(37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), దీపక్ హుడా(28 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 34) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. చివర్లో దుష్మంత్ చమీరా(17), మోహ్‌సిన్ ఖాన్(13 నాటౌట్) ధాటిగా ఆడటంతో లక్నో 150 పరుగుల మార్క్ అందుకోగలిగింది. పంజాబ్ బౌలర్లలో రబడాకు తోడుగా రాహుల్ చాహర్ రెండు, సందీప్ శర్మ ఓ వికెట్ తీసాడు.
రబడా వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్‌లోనే కేఎల్ రాహుల్(6) కీపర్ క్యాచ్‌గా వెనుదిరగ్గా.. క్రీజులోకి వచ్చిన దీపక్ హుడాతో కలిసి డికాక్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 85 పరుగులు జోడించిన అనంతరం హాఫ్ సెంచరీకి చేరువైన డికాక్‌ను సందీప్ శర్మ ఔట్ చేశాడు. ఆ తర్వాత కృనాల్ పాండ్యాను లక్నో మేనేజ్‌మెంట్ చేసిన ప్రయోగం బెడిసికొట్టింది.
క్రీజులో సెట్ అయిన దీపక్ హుడా.. జానీ బెయిర్ స్టో సూపర్ త్రోకు రనౌటయ్యాడు. నిర్లక్ష్యంగా పరుగెత్తిన దీపక్ హుడా మూల్యం చెల్లించుకున్నాడు. ఆ తర్వాత పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. కృనాల్ పాండ్యా(7), మార్కస్ స్టోయినీస్(1), ఆయుష్ బదోని(4), జాసన్ హోల్డర్(11) వరుసగా ఔటయ్యారు. 28 పరుగుల వ్యవధిలోనే లక్నో 6 వికెట్లు కోల్పోయింది. దుష్మంత్ చమీరా రెండు భారీ సిక్స్‌లు బాదగా.. మోహ్‌సిన్ ఖాన్ ఓ ఫోర్, సిక్స్ కొట్టడంతో లక్నో 150 పరుగులు చేయగలిగింది.