Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs KKR:జింబాబ్వే ప్లేయర్ అరంగేట్రం!

మొహాలి: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని కేకేఆర్ సారథి నితీష్ రాణా తెలిపాడు. గత రెండు రోజులుగా ఇక్కడ వర్షాలు కురిసాయని, పిచ్‌పై మాయిశ్చర్ ఉండే అవకాశం ఉందని చెప్పాడు.

కేకేఆర్‌కు సారథ్యం వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపిన నితీష్ రాణా..అతికొద్ది మందికి మాత్రమే దక్కే ఈ బాధ్యతను ఆస్వాదించే ప్రయత్నం చేస్తానన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గురించి ఇప్పుడే మాట్లాడటం సరికాదని, మ్యాచ్‌లు జరుగుతున్నా కొద్దీ ఆ నిబంధన గురించి తెలుస్తుందన్నాడు.

PBKS vs KKR: Zimbabwean Sikandar Raza debut in IPL after KKR wins toss

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లమని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు. తమకు సమతూకమైన జట్టు ఉందని చెప్పిన గబ్బర్.. ఈ మ్యాచ్‌లో విజయాన్నందుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

తమ జట్టు సన్నాహకం అద్భుతంగా జరిగిందని, మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించడంపై తాము ఫోకస్ పెట్టామని తెలిపాడు. తన సారథ్యంలో పంజాబ్ కింగ్స్‌కు టైటిల్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పిన గబ్బర్.. భానుక రాజపక్స, నాథన్ ఎల్లిస్, సామ్ కరణ్‌లను ఓవర్‌సీస్ ఆటగాళ్లుగా బరిలోకి దించుతున్నామని చెప్పాడు.

పంజాబ్ కింగ్స్ తరఫున సికిందర్ రాజా ఈ మ్యాచ్‌లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న సికిందర్ రాజా.. ఎట్టకేలకు వరల్డ్ రిచెస్ట్ టీ20 లీగ్‌లో భాగమయ్యాడు.

తుది జట్లు:
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్, ప్రభ్ సిమ్రాన్ సింగ్, భానుక రాజపక్స, జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, సామ్ కరన్, సికిందర్ రాజా, నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

కేకేఆర్: రెహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), మన్‌దీప్ సింగ్, నితీశ్ రాణా(కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, టీమ్ సౌథీ, అనుకుల్ రాయ్, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ

Story first published: Saturday, April 1, 2023, 15:40 [IST]
Other articles published on Apr 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+