Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs KKR: జట్టులోకి క్రిస్ జోర్డాన్.. పంజాబ్‌దే బ్యాటింగ్!

PBKS vs KKR: Unchanged Kolkata opt to bowl against Punjab

అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నామని కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. ఈ కొత్త మైదానం తమకు కలిసి వస్తుందని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గత మ్యాచ్ గెలవడంతో తమ కాన్ఫిడెన్స్ పెరిగిందన్నాడు. ఇక దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితులపై స్పందిస్తూ.. కరోనాను దేశం ఎదుర్కొంటుందని, అతి త్వరలో పరిస్థితులు సాధారణమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ప్రజలకు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌ను తాము అందిస్తామన్నాడు. ఫాబియన్ అలెన్ స్థానంలో క్రిస్ జోర్డాన్ జట్టులోకి వచ్చాడన్నాడు.

ఈ సీజన్‌లో ఇప్పటికే ఐదు మ్యాచ్‌లాడిన కోల్‌కతా నైట్‌రైడర్స్ కేవలం ఒక్క మ్యాచ్‌లోనే గెలిచి నాలుగింటిలో ఓడింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ మూడు మ్యాచ్‌ల్లో ఓడి రెండింటిలో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు కొత్త వేదికైన నరేంద్ర మోదీ స్టేడియంలో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకూ 27 మ్యాచ్‌ల్లో తలపడగా కేకేఆర్ 18 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. పంజాబ్ 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. గత సీజన్‌లో మాత్రం రెండు మ్యాచ్‌లకు రెండు కేకేఆరే గెలుపొందింది.

తుది జట్లు :
పంజాబ్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, దీపక్ హూడా, షారుఖ్ ఖాన్, మొయిసెస్ హెన్రిక్స్, క్రిస్ జోర్డాన్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ.

IPL 2021 : వీక్ టీమ్ తో పోరాడుతున్న SRH, Fans Missing Bhuvi | Srh vs Dc || Oneindia Telugu

కోల్‌కతా: శుభమన్ గిల్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, సునీల్ నరైన్, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), దినేష్ కార్తీక్(కీపర్), ఆండ్రీ రస్సెల్, ప్యాట్ కమిన్స్, శివం మావి, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి,

Story first published: Monday, April 26, 2021, 19:22 [IST]
Other articles published on Apr 26, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+