PBKS vs KKR: రాణించిన మోర్గాన్, త్రిపాఠి.. కేకేఆర్ ఘన విజయం!

అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 సీజన్‌లో తమ పరాజయాల పరంపరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ ముగింపు పలికింది. అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన కేకేఆర్ 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్(34 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 31), క్రిస్ జోర్డాన్(18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 30)మినహా అంతా విఫలమయ్యారు. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ(3/30), సునీల్ నరైన్(2/22), ప్యాట్ కమిన్స్(2/31) రాణించారు.
అనంతరం కేకేఆర్ 16.4 ఓవర్లలో 5 వికెట్లకు 126 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(40 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47 నాటౌట్), రాహుల్ త్రిపాఠి(32 బంతుల్లో 7 ఫోర్లతో 41) రాణించారు. పంజాబ్ బౌలర్లలో హెన్రీక్స్, షమీ, అర్షదీప్ సింగ్, దీపక్ హుడా తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో కేకేఆర్ ఐదో స్థానంలోకి దూసుకెళ్లగా.. సన్‌రైజర్స్ అట్టడగున నిలిచింది.

ప్చ్.. శుభారంభం లేదు
124 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు నితీశ్ రాణా(0), శుభ్‌మన్ గిల్(9)మరోసారి తీవ్రంగా నిరాశపరిచారు. హెన్రీక్స్ వేసిన ఫస్ట్ ఓవర్‌లోనే నితీశ్ రాణా గోల్డెన్ డక్‌గా వెనుదిరగ్గా.. షమీ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో శుభమన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ వెంటనే సునీల్ నరైన్(0) అర్షదీప్ బౌలింగ్‌లో రవిబిష్ణోయ్ థ్రిల్లింగ్ క్యాచ్‌కు నిరాశగాపెవిలియన్ చేరాడు. దాంతో కేకేఆర్ వరుసగా మూడు ఓవర్లలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది.

ఆదుకున్న త్రిపాఠి, మోర్గాన్..
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ రాహుల్ త్రిపాఠి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలుచిక్కిన బంతిని బౌండరీలకు తరలించింది. దాంతో పంజాబ్ పవర్ ప్లేలో 3 వికెట్లకు 42 రన్స్ చేసింది. అనంతరం మరింత నిలకడగా ఆడిన ఈ జోడీ స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్‌ను నిర్మించింది. ఇక ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని దీపక్ హుడా విడదీసాడు. రాహుల్ త్రిపాఠిని షారుఖ్ సాయంతో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 66 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ముగించిన కార్తీక్..
క్రీజులోకి డేంజరెస్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ రాగా.. మోర్గాన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. కానీ లేని పరుగు కోసం ప్రయత్నించిన ఈ జోడీ మూల్యం చెల్లించుకుంది. ఆర్షదీప్ సింగ్ సూపర్ త్రోకు రస్సెల్(10) నిరాశగా పెవిలియన్ చేరాడు. క్రీజులోకి దినేశ్ కార్తీక్ రాగా.. దీపక్ హుడా బౌలింగ్‌లో మోర్గాన్ ఓ ఫోర్, సిక్సర్ కొట్టాడు. దాంతో కేకేఆర్ విజయానికి 24 బంతుల్లో 9 పరుగులు కావాల్సి రాగా.. దినేశ్ కార్తీక్ మ్యాచ్‌ను ముగించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications