PBKS vs GT: 2 బంతుల్లో 2 సిక్స్‌లు కొట్టి గెలిపించిన తెవాటియా.. పంజాబ్ కొంపముంచిన ఒడియన్ స్మిత్!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో మరో బ్లాక్ బాస్టర్ మ్యాచ్ అభిమానులను కనువిందు చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపించిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ రాహుల్ తెవాటియా.. మరో అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. గతంలో 5 బంతుల్లో 5 సిక్స్‌లు బాది యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన తెవాటియా.. మళ్లీ అదే పంజాబ్ కింగ్స్‌పై చివరి రెండు బంతుల్లో 2 సిక్స్‌లు బాది అద్భుత విజయాన్నందించాడు. అప్పుడు షెల్డన్ కాట్రెల్ కెరీర్‌కు ముగింపు పలికిన తెవాటియా... తాజా మ్యాచ్‌లో ఓడియన్ స్మిత్‌కు చుక్కలు చూపించాడు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
లివింగ్ స్టోన్ విధ్వంసం..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. లియామ్ లివింగ్ స్టోన్(27 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. శిఖర్ ధావన్(30 బంతుల్లో 4 ఫోర్లతో 35), జితేశ్ శర్మ(11 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 23), రాహుల్ చాహర్(14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 22 నాటౌట్) రాణించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీయగా.. దర్శన్ రెండు వికెట్లు పడగొట్టాడు. షమీ, ఫెర్గూసన్, హార్దిక్ తలో వికెట్ తీసారు.
శుభమన్ గిల్ సూపర్ ఇన్నింగ్స్..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. ఓపెనర్ శుభమ్‌న్ గిల్(59 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 96)తృటిలో శతకం చేజార్చుకోగా.. అరంగేట్ర ప్లేయర్ సాయి సుదర్శన్(30 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 35) రాణించాడు. ఇక చివరి రెండు బంతుల్లో రెండు సిక్స్‌లు బాదిన రాహుల్ తెవాటియా(13 నాటౌట్) చిరస్మరణీ విజయాన్నందించాడు.
ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు..
చివరి ఓవర్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గుజరాత్ విజయానికి 6 బంతుల్లో 19 పరుగులు అవసరం అవ్వగా.. ఓడియన్ స్మిత్ బంతిని అందుకున్నాడు. తొలి బంతిని వైడ్ వేసిన అతను రెండో బంతిని కూడా వైడ్ యార్కర్‌గా వేయగా.. హార్దిక్ పాండ్యా రనౌటయ్యాడు. క్రీజులోకి వచ్చిన తెవాటియా సింగిల్ తీసాడు. దాంతో గుజరాత్ ఓటమి ఖాయమని అంతా భావించారు. మూడో బంతిని ఫోర్ కొట్టిన మిల్లర్ నాలుగో బంతిని డాట్ చేశాడు. అయితే నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో తెవాటియా క్రీజును ధాటగా.. స్మిత్ రనౌట్ కోసం ప్రయత్నించాడు. బంతిని వికెట్లను తాకకపోవడంతో సింగిల్ వచ్చింది. గుజరాత్ విజయానికి 2 బంతుల్లో 2 సిక్స్‌లు అవసరమవ్వగా.. తెవాటియా లెగ్ సైడ్ రెండు షాట్లు ఆడి మ్యాచ్‌ను ముగించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications