For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PBKS vs GT: కొంపముంచిన రబడా.. గుజరాత్‌ను గెలిపించిన రాహుల్ తెవాటియా!

ఐపీఎల్ 2024 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఆ జట్టు ఓటమిపాలైంది. గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో పేలవ బ్యాటింగ్‌తో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. రాహుల్ తెవాటియా సంచలన బ్యాటింగ్‌తో పంజాబ్ కింగ్స్ ఓటమిని శాసించాడు. కీలకమైన 18వ ఓవర్‌లో కగిసో రబడా 20 పరుగులిచ్చి పంజాబ్ కొంపముంచాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులకు కుప్పకూలింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(21 బంతుల్లో 3 ఫోర్లతో 35), హర్‌ప్రీత్ బ్రార్(12 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 29), సామ్ కరణ్(19 బంతుల్లో 2 ఫోర్లతో 20) టాప్ స్కోరర్లుగా నిలిచారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సాయికిషోర్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మోహిత్ శర్మ, నూర్ అహ్మద్ రెండేసి వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.

Rahul Tewatia

అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 19.1 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసి 5 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. శుభ్‌మన్ గిల్(29 బంతుల్లో 5 ఫోర్లతో 35), సాయి సుదర్శన్(34 బంతుల్లో 3 ఫోర్లతో 31) టాప్ స్కోరర్లుగా నిలవగా.. రాహుల్ తెవాటియా(18 బంతుల్లో 7 ఫోర్లతో 36 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

శుభారంభం లేకున్నా..
143 పరుగుల స్వల్ప లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్‌ వృద్దిమాన్ సాహా(13)ను అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా సాయి సుదర్శన్‌ క్రీజులోకి రాగా.. శుభ్‌మన్ గిల్ ఆచితూచి ఆడాడు. హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న శుభ్‌మన్ గిల్‌ను లివింగ్ స్టోన్ ఔట్ చేశాడు.

తన మరుసటి ఓవర్‌లో డేవిడ్ మిల్లర్(4) పెవిలియన్ చేర్చాడు. నిలకడగా ఆడిన సాయి సుదర్శన్‌ను సామ్ కరణ్ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్(13)ను హర్షల్ పటేల్ ఔట్ చేశాడు. దాంతో గుజరాత్ 103 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. దాంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది.

గెలిపించిన రాహుల్ తెవాటియా..
కానీ రాహుల్ తెవాటియా.. వరుస బౌండరీలతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రబడా వేసిన 18వ ఓవర్‌లో రాహుల్ తెవాటియా మూడు బౌండరీలు బాదగా.. షారుఖ్ ఖాన్(8) ఓ సిక్స్ కొట్టాడు. దాంతో ఈ ఓవర్‌లో 20 పరుగులు వచ్చాయి. ఈ ఓవరే మ్యాచ్ మూమెంటమ్‌ను గుజరాత్ వైపు తిప్పింది. ఈ ఓవర్ కాస్త కట్టుదిట్టంగా వేసి ఉంటే మ్యాచ్ ఉత్కంఠగా మారేది.

మరుసటి ఓవర్‌లో షారుఖ్ ఖాన్‌ను హర్షల్ పటేల్ ఔట్ చేసినా.. రషీద్ ఖాన్(3) విఫలమైనా.. రాహుల్ తెవాటియా విజయాలాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Sunday, April 21, 2024, 23:19 [IST]
Other articles published on Apr 21, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+