Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs GT: ఓటమి తప్పించిన రాహుల్ తెవాటియా.. గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ!

మొహాలీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ మరో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్‌తో గురువారం ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి 2 బంతుల్లో 4 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో రాహుల్ తెవాటియా తన ట్రేడ్ మార్క్ షాట్‌తో బౌండరీ బాది విజయాన్నందించాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్(24 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 36), జితేశ్ శర్మ(25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ రెండు వికెట్లు తీయగా.. షమీ, జోష్ లిటిల్, అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసారు.

rahul tewatia gujarat titans

అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 154 పరుగులు చేసి మరో బంతి మిగిలుండగానే విజయాన్నందుకుంది. శుభ్‌మన్ గిల్(49 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 67) హాఫ్ సెంచరీతో రాణించగా.. వృద్దిమాన్ సాహా(19 బంతుల్లో 5 ఫోర్లతో 30), డేవిడ్ మిల్లర్(17 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్, రబడా, సామ్ కరణ్, హర్‌ప్రీత్ బ్రార్ తలో వికెట్ తీసారు.

అదిరిపోయే ఆరంభం: 154 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు వృద్దిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఈ ఇద్దరూ పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దూకుడుగా ఆడుతున్న సాహాను రబడా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి.. ఐపీఎల్‌లో 100 వికెట్ల ఘనతను అందుకున్నాడు.

అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు. సాహా ఔటవ్వడంతో తొలి వికెట్‌కు నమోదైన 48 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్‌తో శుభ్‌మన్ గిల్ ఆడాడు. కీలక భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని అర్ష్‌దీప్ సింగ్ ఔట్ చేశాడు. సాయి సుదర్శన్‌(19)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

శుభ్‌మన్ హాఫ్ సెంచరీ: అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా(8)ను హర్‌ప్రీత్ బ్రార్ పెవిలియన్ చేర్చగా.. క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్‌తో శుభ్‌మన్ ధాటిగా ఆడాడు.ఈ క్రమంలో అతను హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రబడా వేసిన 18వ ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ ఓ సిక్సర్ బాది లక్స్యానికి చేరువగా తీసుకెళ్లాడు. అర్ష్‌దీప్ సింగ్ 19వ ఓవర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 6 పరుగులే ఇవ్వడంతో పంజాబ్ విజయానికి చివరి ఓవర్‌లో 7 పరుగులు అవసరమయ్యాయి.

shubman gill gujarat titans

తెవాటియా స్పెషల్: సామ్ కరణ్ వేసిన చివరి ఓవర్‌లో తొలి బంతికి సింగిల్ మాత్రమే ఇచ్చి శుభ్‌మన్ గిల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా సింగిల్ తీయగా.. మిల్లర్ కూడా సింగిలే తీయడంతో టెన్షన్ అమాంతం పెరిగిపోయింది. కానీ రాహుల్ తెవాటియా సూపర్ షాట్‌తో బౌండరీ బాది విజయాన్నందించాడు.

Story first published: Thursday, April 13, 2023, 23:32 [IST]
Other articles published on Apr 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+