PBKS vs GT: కొంపముంచిన తెవాటియా జిడ్డు బ్యాటింగ్.. ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం!
ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. ముల్లాన్‌పూర్ వేదికగా మంగళవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో కూపర్ కానల్లీ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో పంజాబ్ గెలుపొందింది. మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ.. కూపర్ కానల్లీ ఆఖరి వరకు క్రీజులో నిలిచి పంజాబ్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(27 బంతుల్లో 6 ఫోర్లతో 39), జోస్ బట్లర్(33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), గ్లేన్ ఫిలిప్స్(17 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాక్(3/34) మూడు వికెట్లు తీయగా.. యుజ్వేంద్ర చాహల్(2/28) రెండు వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్‌కు ఒక వికెట్ దక్కింది.

అనంతరం పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు చేసి గెలుపొందింది. కూపర్ కానల్లీ(44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 72 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
ప్రభ్ సిమ్రాన్ సింగ్(24 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 37) పర్వాలేదనిపించగా.. శ్రేయస్ అయ్యర్(18), నెహాల్ వధేరా(3), శశాంక్ సింగ్(4), మార్కస్ స్టోయినీస్(0), మార్కో జాన్సెన్(9) తీవ్రంగా నిరాశపర్చారు. గ్జేవియర్ బార్ట్‌లెట్(5 బంతుల్లో సిక్సర్‌తో 11 నాటౌట్) విలువైన పరుగులు జోడించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ(3/15) మూడు వికెట్లు తీయగా.. కగిసో రబడా, అశోక్ శర్మ, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీసారు.
కొంపముంచిన జిడ్డు బ్యాటింగ్..
గుజరాత్ టైటాన్స్ లోయార్డర్ వైఫల్యం ఆ జట్టు కొంపముంచింది. వాషింగ్టన్ సుందర్(16 బంతుల్లో 18), రాహుల్ తెవాటియా(10 బంతుల్లో 11 నాటౌట్) జిడ్డు బ్యాటింగ్ గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ అవకాశాలను దెబ్బతీసింది. దాంతో ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓటమి చవిచూసింది.
లోయరార్డర్ బ్యాటర్లు కాస్త దూకుడగా ఆడి 15-20 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. 15 ఓవర్లలోనే 128 పరుగులు చేసిన గుజరాత్.. చివరి 5 ఓవర్లలో 34 పరుగులు చేసింది. స్లాగ్ ఓవర్లలో దూకుడుగా ఆడాల్సిన గుజరాత్ బ్యాటర్లు భారీ షాట్లు ఆడలేక చేతులెత్తేసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications