ధర్మశాల: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శిఖర్ ధావన్ సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. రన్నింగ్ చేస్తూ సూపర్ డైవ్‌తో ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. శిఖర్ ధావన్ స్టన్నింగ్ క్యాచ్‌తో డేవిడ్ వార్నర్(31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46) హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు.
ఢిల్లీ ఇన్నింగ్స్ సందర్భంగా సామ్ కరణ్ వేసిన 11వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని సామ్ కరణ్ నెమ్మదిగా వేయగా.. వార్నర్ స్లాప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో గాల్లోకి లేచింది. కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ధావన్ అద్భుతంగా పరుగెత్తి.. సూపర్ డైవ్‌తో సింగిల్ హ్యాండ్‌తో అందుకున్నాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, పృథ్వీ షా అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్ నుంచే హిట్టింగ్ చేసిన ఈ జోడీ.. పోటా పడి పరుగులు రాబట్టింది. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమై తుది జట్టులో చోటు కోల్పోయిన పృథ్వీ రీఎంట్రీలో దుమ్ములేపాడు. పాత పృథ్వీ షాను తలపిస్తూ చూడముచ్చటైన షాట్లను ఆడాడు.
దాంతో ఢిల్లీ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. అనంతరం అదే జోరును కనబర్చిన ఈ జోడీని సామ్ కరణ్ శిఖర్ ధావన్ స్టన్నింగ్ క్యాచ్ సాయంతో విడదీసాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 94 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఇక 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద డేవిడ్ వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్ చాహర్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన వార్నర్.. చివరకు హాఫ్ సెంచరీ చేసుకోకుండానే వెనుదిరిగాడు.క్రీజులోకి రిలే రోసౌ రాగా.. పృథ్వీ షా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు.