Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే కేఎస్ భరత్‌ను పక్కనపెట్టాం: రిషభ్ పంత్

PBKS vs DC: Rishabh Pant reveals the reason why KS Bharat is not a part of playing XI

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గతంలో ఈ మైదానంలో ఆడినప్పుడు డ్యూ ప్రభావం కనిపించందని, ఈ మ్యాచ్‌లో కూడా వచ్చే అవకాశం ఉందనే ఈ నిర్ణయం తీసుకున్నానని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తెలిపాడు. డ్యూ వస్తే చేజింగ్‌లో అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పాడు. ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నామన్నాడు. తాము సరైన కాంబినేషన్ బరిలోకి దిగుతున్నామని తెలిపిన మయాంక్ అగర్వాల్... గత రెండు మ్యాచ్‌లు సమష్టిగా రాణించామన్నాడు. అదే జోరును ఈ మ్యాచ్‌లో కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ప్లే ఆఫ్స్ చేరాలంటే ప్రతీ మ్యాచ్ గెలవడం తమకు ముఖ్యమేనన్నాడు.

టాస్ గెలిస్తే తాము కూడా ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లమని ఢిల్లీ సారథి రిషభ్ పంత్ అన్నాడు. జట్టులో రెండు మార్పులు చేశామని చెప్పిన పంత్.. గాయం నుంచి కోలుకున్న ఖలీల్ అహ్మద్ జట్టులోకి వచ్చాడన్నాడు. చేతన్ సకారియా స్థానంలో అతను బరిలోకి దిగుతుండగా.. కేఎస్ భరత్ ప్లేస్‌లో సర్ఫరాజ్ ఆడుతున్నాడని తెలిపాడు. తమ ప్రణాళికలకు తగ్గట్లు రాణించడంపైనే ఫోకస్ పెడతామని చెప్పాడు. టీమ్ కాంబినేషన్ నేపథ్యంలోనే కేఎస్ భరత్‌ను జట్టు నుంచి తప్పించాల్సి వచ్చిందని చెప్పాడు.

PBKS vs DC: Rishabh Pant reveals the reason why KS Bharat is not a part of playing XI

తుది జట్లు:

1
53673

ఢిల్లీ: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్(కెప్టెన్), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పొవెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జ్, ఖలీల్ అహ్మద్

పంజాబ్ కింగ్స్: జానీ బెయిర్ స్టో, శిఖర్ ధావన్, భానుక రాజపక్స, లియామ్ లివింగ్ స్టోన్, మయాంక్ అగర్వాల్, జితేశ్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, కగిసో రబడా, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్

Story first published: Monday, May 16, 2022, 19:49 [IST]
Other articles published on May 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+