For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PBKS vs DC:దెబ్బకొట్టిన లివింగ్ స్టోన్.. ఆదుకున్న మిచెల్ మార్ష్.. పంజాబ్ ముందు పోరాడే లక్ష్యం!

PBKS vs DC: Marsh fifty powers Delhi Capitals to 159/7 in 20 overs; Livingstone picks three wickets

ముంబై: మిచెల్ మార్ష్(48 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీతో రాణించడంతో పంజాబ్ కింగ్స్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ 160 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఉంచింది. మిచెల్ మార్ష్‌కు తోడుగా సర్ఫరాజ్ ఖాన్(16 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 32) ఒక్కడే రాణించడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో లివింగ్ స్టోన్, అర్షదీప్ సింగ్ మూడేసి వికెట్లు తీయగా.. రబడా ఓ వికెట్ పడగొట్టాడు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభారంభం దక్కలేదు. విధ్వసంకర ఓపెనర్ డేవిడ్ వార్నర్(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. లివింగ్‌స్టోన్ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్‌కే క్యాచ్ ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన మిచెల్ మార్ష్‌తో కలిసి మరో ఓపెనర్ సర్ఫరాజ్ ఖాన్ ధాటిగా ఆడాడు. వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. సర్ఫరాజ్ హిట్టింగ్‌లో 4.3 ఓవర్లలోనే ఢిల్లీ 50 పరుగులు చేసింది. అయితే అదే జోరులో భారీ షాట్‌కు ప్రయత్నించిన సర్ఫరాజ్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 51 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన లలిత్ యాదవ్ ఎదుర్కొన్న తొలి బంతికే క్యాచ్ ఔటయ్యాడు. కానీ అది కాస్త నోబాల్ కావడంతో ఔటవ్వకుండా బచాయించాడు.

PBKS vs DC: Marsh fifty powers Delhi Capitals to 159/7 in 20 overs; Livingstone picks three wickets

మిచెల్ మార్ష్, లలిత్ కలిసి నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. అర్షదీప్ సింగ్ వేసిన స్లోయర్ బాల్‌కు లలిత్ యాదవ్ చెత్త షాట్‌తో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన డేంజరస్ రిషభ్ పంత్(7), పోవెల్(2)లను లివింగ్ స్టోన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో ఢిల్లీ ఇన్నింగ్స్‌ గాడితప్పింది. హర్‌ప్రీత్ బ్రార్ వేసిన 17వ ఓవర్‌లో బౌండరీ బాదిన మిచెల్ మార్ష్.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మార్ష్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అతని జోరుకు రబడా కళ్లెం వేసాడు. స్లోయర్ బాల్‌తో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఇక చివరి ఓవర్‌లో అర్షదీప్ సింగ్ ఓ వికెట్ తీసి ఏడు పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఢిల్లీ సాధారణ స్కోర్‌కు పరిమితమైంది.

Story first published: Monday, May 16, 2022, 21:25 [IST]
Other articles published on May 16, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+