For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PBKS vs DC: ఒకే ఓవర్‌లో 5 బౌండరీలు.. 21 ఏళ్ల కుర్రాడి విధ్వంసం! (వీడియో)

ఢిల్లీ క్యాపిటల్స్ యువ ప్లేయర్ అభిషేక్ పోరెల్ సంచలన బ్యాటింగ్‌తో ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 6 బంతుల్లో ఐదు బౌండరీలు బాది 25 పరుగులు పిండుకున్నాడు. ఇందులో రెండు భారీ సిక్సర్లు ఉండటం విశేషం.

అభిషేక్ పొరెల్ విధ్వంసానికి పంజాబ్ కింగ్స్ పేసర్ హర్షల్ పటేల్ బలయ్యాడు. ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన అభిషేక్ పోరెల్.. హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్‌ తొలి బంతిని బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా బౌండరీ రాబట్టాడు. రెండో బంతిని మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ కొట్టాడు. మూడో బంతిని ఓవర్ బ్యాక్‌వార్డ్ స్క్వేర్ లెగ్ దిశగా బౌండరీకి పంపించాడు.

PBKS vs DC IPL 2024 Abishek Porel smashes Harshal Patel for 25 runs in final over Video goes viral

నాలుగో బంతిని థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీ సాధించాడు. ఐదో బంతిని ఓవర్ స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్ బాదాడు. చివరి బంతిని హర్షల్ పటేల్ కాస్త కట్టుదిట్టంగా వేయడంతో అభిషేక్ పొరెల్ లాంగాన్ దిశగా ఆడి క్విక్ డబుల్‌కు ప్రయత్నించాడు. కానీ రెండో రన్ పూర్తి చేసే క్రమంలో నాన్ స్ట్రైకర్ కుల్దీప్ యాదవ్ రనౌటయ్యాడు. దాంతో ఈ ఓవర్‌లో 25 పరుగులు వచ్చాయి.

అభిషేక్ పోరెల్ ఊహించని విధ్వంసంతో సాధారణ స్కోర్‌కే పరమితమవుతుందనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. 175 పరుగుల పోరాడే లక్ష్యాన్ని అందుకుంది. 10 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 పరుగులతో అజేయంగా నిలిచిన అభిషేక్ పొరెల్..తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చాడు. అభిషేక్ పోరెల్‌ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 21 ఏళ్ల ఈ కుర్రాడిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్‌తో పాటు షై హోప్(25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) టాప్ స్కోరర్లుగా నిలిచారు. డేవిడ్ వార్నర్(28), మిచెల్ మార్ష్(20), రిషభ్ పంత్(18), అక్షర్ పటేల్(21) పర్వాలేదనిపించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ రెండేసి వికెట్లు తీయగా.. రబడా, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీసారు.

Story first published: Saturday, March 23, 2024, 18:02 [IST]
Other articles published on Mar 23, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+