Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs DC: గాలికి పోయే కంపను తగిలించుకోవడం అంటే ఇదే.. డేవిడ్ వార్నర్ ఔటైన తీరుపై ఫ్యాన్స్ సెటైర్స్!

PBKS vs DC: David Warners decision to change strike at last second goes wrong

ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతను ఔటైన తీరును తప్పుబడుతూ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేల్చుతున్నారు. ఈ సీజన్‌లో సూపర్ ఫామ్ కనబర్చిన డేవిడ్ వార్నర్ పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అయితే అతను ఔటైన తీరు అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. అత్యత్సాహంతో వార్నర్ ఔటయ్యాడని కామెంట్ చేస్తున్నారు. అతి అనేది ఎక్కడా పనికి రాదని, వార్నర్ విషయంలోనూ అదే నిరూపితమైందని అభిప్రాయపడుతున్నారు.

అసలేం జరిగిందంటే..?

టాస్ ఓడి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్‌కు దిగగా.. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే వార్నర్ పెవిలియన్ చేరాడు. లివింగ్ స్టోన్ వేసిన ఫస్ట్ బాల్‌ను వార్నర్ డ్రైవ్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బ్యాట్ ఎడ్జ్‌లో తాకిన బంతి గాల్లోకి లేచింది. బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ చాహల్ సింపుల్‌గా అందుకున్నాడు. వాస్తవానికి డేవిడ్ వార్నర్ ఎప్పుడైన బ్యాటింగ్ చేయకుండా నాన్ స్ట్రైకింగ్‌లోకి వెళ్తాడు. ఈ మ్యాచ్ లోనూ మొదట నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో వెళ్లి నిలబడ్డాడు.

అనవసరంగా స్ట్రైకింగ్ తీసుకొని..

కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. సర్ఫరాజ్‌ను వద్దని చెప్పి మరీ స్ట్రైకింగ్‌లోకి వచ్చాడు. బహుషా గత మ్యాచ్ ల్లో ఓపెనర్లుగా వచ్చిన మన్ దీప్ సింగ్, కేఎస్ భరత్ లు తొలి ఓవర్లోనే అవుటవ్వడాన్ని గుర్తు తెచ్చుకున్నాడో ఏమో.. సడెన్ గా పిచ్ మధ్యకు వచ్చి సర్ఫరాజ్ ను నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లోకి వెళ్లాల్సిందిగా సూచించాడు. సీనియర్ చెప్పడంతో సర్ఫరాజ్ మరో మాట చెప్పకుండా నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లోకి వెళ్లి నిలబడ్డాడు. అయితే లివింగ్ స్టోన్ వేసిన తొలి బంతికే వార్నర్ ఔటవ్వడంతో అత్యుత్సాహం కొంపముంచిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సర్ఫరాజ్ ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగాడు.

మార్ష్ చెలరేగడంతో..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్(48 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సర్ఫరాజ్ ఖాన్(16 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 32) మెరుపులు మెరిపించాడు. పంజాబ్ బౌలర్లలో లివింగ్ స్టోన్, అర్షదీప్ సింగ్ మూడేసి వికెట్లు తీయగా.. రబడా ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం పంజాబ్ 67 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

Story first published: Monday, May 16, 2022, 22:43 [IST]
Other articles published on May 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+