PBKS vs CSK: అంబటి రాయుడు చెలరేగినా.. చెన్నైకి తప్పని ఓటమి! సన్నగిల్లిన ప్లే ఆఫ్స్ చాన్స్

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ మరో విజయాన్నందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన పంజాబ్ 11 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(59 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 88 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. భానుక రాజపక్స(32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42) రాణించాడు. చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రావో రెండు వికెట్లు తీయగా.. మహీశ్ తీక్షణ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు మాత్రమే చేసింది. తెలుగు తేజం అంబటి రాయుడు(39 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78) పరుగులతో ఒంటరి పోరాటం చేసిన ఫలితం లేకపోయింది. పంజాబ్ బౌలర్లలో కగిసో రబడా, రిషి ధావన్ రెండేసి వికెట్లు తీయగా.. సందీప్ శర్మ,అర్షదీప్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చాన్స్ సన్నగిల్లాయి.

శుభారంభం లేదు..
188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. సందీప్ శర్మ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే రాబిన్ ఊతప్ప(1) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి వచ్చిన మిచెల్ సాంట్నర్‌తో రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. కళాత్మక కవర్ డ్రైవ్స్‌తో వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అర్షదీప్ సింగ్ సూపర్ బాల్‌తో మిచెల్ సాంట్నర్ క్లీన్ బౌల్డ్ చేయడంతో పవర్ ప్లేలో సీఎస్‌కే 2 వికెట్లకు 33 పరుగులు మాత్రమే చేసింది.

రిషి ధావన్ సూపర్ రీఎంట్రీ..
ఆ మరుసటి ఓవర్‌లోనే రిషి ధావన్.. శివమ్ దూబే(8)ను క్లీన్ బౌల్ట్ చేసాడు. ఆరేళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్‌లో ఆడే అవకాశాన్ని అందుకున్న రిషి ధావన్.. తన రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు.. రుతురాజ్ గైక్వాడ్‌తో ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. 49 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన ఈ జోడీని రబడా విడదీసాడు. క్రీజులో సెట్ అయిన రుతురాజ్ గైక్వాడ్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

చెలరేగిన రాయుడు..
ఈ పరిస్థితుల్లో రవీంద్ర జడేజాతో కలిసి రాయుడు చెలరేగాడు. రాహుల్ చాహర్ వేసిన 15వ ఓవర్‌లో భారీ సిక్సర్‌తో 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సందీప్ శర్మ వేసిన మరుసటి ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్స్‌లు బాదిన రాయుడు 23 పరుగులు పిండుకున్నాడు. 17వ ఓవర్‌లో అర్ష్‌దీప్ 6 పరుగులే ఇవ్వడంతో ఒత్తిడికి గురైన రాయుడు.. రబడా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో చివరి 12 బంతుల్లో సీఎస్‌కే విజయానికి 35 పరుగులు అవసరమయ్యాయి.

అర్షదీప్ సూపర్..
అయితే అర్ష్‌దీప్ సింగ్ మరోసారి కట్టుదిట్టమైన బౌలింగ్‌తో 8 పరుగులివ్వడంతో మ్యాచ్ ఉత్కంఠకు దారితీసింది. చివరి ఓవర్‌లో చెన్నై విజయానికి 27 పరుగులు అవసరమయ్యాయి. రిషి ధావన్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన ధోనీ అదే ఓవర్ మూడో బంతికి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో పంజాబ్ విజయం ఖాయమైంది. జడేజా సిక్స్‌ర్ కొట్టినా ఫలితం లేకపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications