Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS Team For IPL 2022: పవర్ ఫుల్ బ్యాటింగ్.. బౌలింగ్ ఓకే! బలహీనంగా బ్యాకప్.. తుది జట్టు అంచనా ఇదే!

PBKS Team For IPL 2022: Panjab Kings Playing 11, Batting, Bowling And Complete Review

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఉన్న పేరు అండర్ డాగ్స్‌! స్టార్ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా.. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగినా.. ఆఖర్లో చతికలబడటం ఆ జట్టు ఆనవాయితీ..! అంచనాలే లేనప్పుడు ధీటుగా పోటీ ఇవ్వడం.. కీలక సమయంలో చేతులు ఎత్తేయడం ఆ టీమ్ నైజం.! ఈ కారణంగానే గత 14 సీజన్లలో ఒక్కసారి కూడా పంజాబ్ టైటిల్ గెలవలేకపోయింది. ఆటగాళ్లు మారినా, కెప్టెన్లు, కోచ్‌లు మళ్లీ మళ్లీ మారినా... టీమ్‌ జెర్సీ రూపురేఖలు మార్చినా ఆ జట్టు రాత మాత్రం మారలేదు.

అప్పుడప్పుడు కొన్ని వ్యక్తిగత ప్రదర్శనల మెరుపులు తప్ప ఒక జట్టుగా పంజాబ్‌ పెద్దగా ఫలితాలు సాధించలేకపోయింది. గత సీజన్ 'ఎలెవన్‌'ను పక్కన పడేసి టీమ్‌ పేరులో స్వల్ప మార్పుతో 'కింగ్స్‌'గా బరిలోకి దిగినా ఆ జట్టుకు కలిసి రాలేదు. సూపర్ ఓవర్‌కే సూపర్ ఓవర్ ఆడిన చరిత్ర పంజాబ్‌ది. ఈ క్రమంలోనే తీవ్ర చికాకు గురైన కేఎల్ రాహుల్ ఆ జట్టును వదిలేసి నయా ఫ్రాంచైజీ లక్నో టీమ్‌తో జత కట్టాడు.

వేలంలో దూకుడు..

వేలంలో దూకుడు..

కేఎల్ రాహుల్, షారూఖ్, రవి బిష్ణోయ్ వంటి తమ మాజీ ఆటగాళ్లు వేలంలోకి వెళ్తామని పట్టుబట్టడంతో పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్(రూ.14 కోట్లు), అర్ష్‌దీప్ సింగ్(రూ.4 కోట్లు)లను మాత్రమే రిటైన్ చేసుకుంది. దాంతో పంజాబ్ వేలంలో రూ.72 కోట్లతో రిచెస్ట్ ఫ్రాంచైజీగా పాల్గొంది. గతంలో కూడా భారీ డబ్బుతో వేలంలో పాల్గొన్న పంజాబ్ సరైన ఆటగాళ్లను కొనుగోలు చేయలేకపోయింది. కానీ ఈ సారి మాత్రం మంచి టీమ్‌ను సెలెక్ట్ చేసుకుంది. ముఖ్యంగా ఆ జట్టు మొదటి తుది జట్టు అద్భుతంగా ఉంది. కానీ బ్యాకప్ ఆప్షనే బాలేదు. లియాన్ లివింగ్ స్టోన్(రూ.11.5 కోట్లు), షారూఖ్ ఖాన్(రూ.9 కోట్లు), శిఖర్ ధావన్(రూ.8.25 కోట్లు), జానీ బెయిర్ స్టో(రూ. 6.75 కోట్లు), రాహుల్ చాహర్ (రూ.5.25 కోట్లు), కగిసో రబడా(రూ.9.25 కోట్లు)ల కోసం పంజాబ్ బాగా ఖర్చు పెట్టింది.

స్మార్ట్ పిక్స్ ఇవే..

స్మార్ట్ పిక్స్ ఇవే..

ఈ ఆరుగురి ఆటగాళ్ల కోసమే రూ.50 కోట్లు ఖర్చు పెట్టగా.. మిగతా రూ. 12 కోట్లతోనే ఇతర ఆటగాళ్ల స్థానాలను నింపేసింది. దాంతో అనామక ఆటగాళ్లను తీసుకురావాల్సి రావడంతో బ్యాకప్ బలహీనంగా కనిపిస్తోంది. అయితే బిగ్ హిట్టింగ్ సామర్థ్యంతో పాటు ఆఫ్ , లెగ్ స్పిన్ వేయగల లియామ్ లివింగ్‌స్టోన్ తీసుకొని మంచి పని చేసింది. అంతేకాకుండా స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్, బెయిర్ స్టోలను తక్కువ ధరకే కొనుగోలు చేసింది. సౌతాఫ్రికా పేస్ దిగ్గజం కగిసో రబడాను దక్కించుకుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ రాహుల్‌ చాహర్‌ను కూడా తీసుకోవడం పంజాబ్‌కు ప్లస్ పాయింట్. 8 మంది ఓవర్ సీస్ ప్లేయర్స్‌ తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ పంజాబ్ ఏడుగురిని మాత్రమే తీసుకుంది. ఎక్కువ అనామక ఆటగాళ్లను తీసుకోవడంతో బ్యాకప్ బలహీనంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఓ మంచి ఇండియన్ బ్యాట్స్‌మన్ , ఫారిన్ బౌలర్ మిస్సైనట్లు అనిపిస్తోంది. క్వాలిటీ, ఎక్సైటింగ్ ఆల్‌రౌండర్ కూడా లేకపోవడం ఆ జట్టు బలహీనతగా చెప్పుకోవచ్చు.

ఓపెనర్లుగా శిఖర్, మయాంక్..

ఓపెనర్లుగా శిఖర్, మయాంక్..

ఇక ఓపెనర్లుగా శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ బరిలోకి దిగనున్నారు. ఇద్దరూ అనుభవం కలిగిన ఆటగాళ్లే కావడం పంజాబ్‌కు ప్లస్ పాయింట్. జానీ బెయిర్ స్టో నెంబర్ 3లో బ్యాటింగ్ చేసే చాన్సుంది. ఆ తర్వాత ఫించ్ హిట్టర్ లియామ్ లింగ్ స్టోన్‌, షారూఖ్ ఖాన్ బరిలోకి దిగనున్నారు. ఆరో స్థానంలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఓడీన్ స్మిత్, ఏడో స్థానంలో రిషి ధావన్ బ్యాటింగ్ చేయనున్నారు. ఏనిమిదో స్థానంలో హర్‌ప్రీత్ బ్రార్ బరిలోకి దిగనున్నాడు. స్పెషలిస్ట్ పేసర్లుగా కగిసో రబడాతో పాటు అర్ష్ దీప్ సింగ్ ఆడనున్నారు. రబడా వరకు బ్యాటింగ్ డెప్త్ ఉంది. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రాహుల్ చాహర్ బరిలోకి దిగనున్నాడు. ఇక కెప్టెన్‌గా శిఖర్ ధావన్‌ను నియమిస్తారని అంతా భావించినా.. మయాంక్ అగర్వాల్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.

పంజాబ్ తుది జట్టు అంచనా..

పంజాబ్ తుది జట్టు అంచనా..

శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, జానీ బెయిర్ స్టో, లియామ్ లివింగ్ స్టోన్, షారూఖ్ ఖాన్, ఓడీన్ స్మిత్, రిషి ధావన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడా, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్,

పంజాబ్ పూర్తి జట్టు ఇదే..

పంజాబ్ పూర్తి జట్టు ఇదే..

మయాంక్ అగర్వాల్(రూ.14 కోట్లు), అర్ష్‌దీప్ సింగ్(రూ.4 కోట్లు), లియామ్ లివింగ్ స్టోన్(రూ.11.50 కోట్లు), కగిసో రబడా(రూ.9.25 కోట్లు), షారూఖ్ ఖాన్(రూ.9 కోట్లు), శిఖర్ ధావన్(రూ.8.25 కోట్లు), జానీ బెయిర్ స్టో(రూ.6.75 కోట్లు), ఓడిన్ స్మిత్(రూ.6 కోట్లు), రాహుల్ చాహర్(రూ.5.25 కోట్లు), హర్‌ప్రీత్ బ్రార్(రూ.3.80 కోట్లు), రాజ్ అంగడ్ బావ(రూ.2 కోట్లు), వైభవ్ అరోరా(రూ.2 కోట్లు), నాథన్ ఎల్లిస్(రూ.75 లక్షలు), ప్రభ్ సిమ్రన్ సింగ్(రూ.60 లక్షలు), రిషీ ధావన్(రూ.55 లక్షలు), సందీప్ వర్మ(రూ.50 లక్షలు), భానుక రాజపక్స(రూ.50 లక్షలు), బెన్ని హోవల్(రూ.40 లక్షలు), ఇషాన్ పోరెల్(రూ.25 లక్షలు), జితేశ్ శర్మ(రూ.20 లక్షలు), ప్రేరక్ మన్కండ్(రూ.20 లక్షలు), అథర్వ టైడ్(రూ.20 లక్షలు), వ్రిట్టిక్ చటర్జీ(రూ.20 లక్షలు), బాల్‌తేజ్ ధండా(రూ.20 లక్షలు), అన్ష్ పటేల్(రూ.20 లక్షలు)

Story first published: Saturday, February 26, 2022, 7:39 [IST]
Other articles published on Feb 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+