Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పంజాబ్ కింగ్స్ కో ఓనర్‌పై సంచలన ఆరోపణలు.. !

కాంగ్రెస్ పార్టీపై పంజాబ్ కింగ్స్ కో-ఓనర్, బాలీవుడ్ వెటరన్ హీరోయిన్ ప్రీతి జింటా ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు వార్తలను ప్రచారం చేసేందుకు సిగ్గుండాలని మండిపడింది. న్యూ ఇండియా కో ఆపరేటివ్‌ బ్యాంక్‌లో ప్రీతి జింటా రూ.18 కోట్ల రుణం తీసుకొని ఎగ్గొట్టిందని కేరళ కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల వేదికగా ఆరోపించింది.

ఈ రుణాన్ని మాపీ చేసుకునేందుకు ప్రీతి జింటా తన సోషల్‌ మీడియా ఖాతాలను బీజేపీకి అప్పగించిందని కూడా పేర్కొంది. గత వారం ఆ బ్యాంకును మూసేయడంతో డిపాజిటర్లు రోడ్డున పడ్డారని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు ప్రీతి జింటా ఫొటోను చూడా జత చేసింది. ఈ ఆరోపణలపై ప్రీతి జింటా ఘాటుగా స్పందించింది.

PBKS Co Owner Preity Zinta Slams Kerala Congress Over Fake Loan Claim

తన సోషల్‌ మీడియా ఖాతాలను తానే సొంతంగా నిర్వహించుకుంటున్నానని స్పష్టం చేసింది. తన సోషల్ మీడియా ఖాతాలను ఎవరికీ ఇవ్వలేదని పేర్కొంది. అంతేకాకుండా తాను తీసుకున్న రుణాన్ని ఎవరూ మాఫీ చేయలేదని స్పష్టం చేసింది. పదేళ్ల క్రితమే బ్యాంకు నుంచి తాను రుణం తీసుకొని పూర్తిగా తీర్చేశానని కూడా పేర్కొంది. కాంగ్రెస్‌ పార్టీ చేసిన పోస్ట్‌ చూసి తాను షాక్‌ అయ్యానని, తనపై ఇలా తప్పుడు ప్రచారం చేయడానికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ప్రీతి జింటా వరుస పోస్ట్‌లు పెట్టింది.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ప్రీతి జింటా వ్యాపారాలను చూసుకుంటుంది. ఐపీఎల్ టీమ్ పంజాబ్ కింగ్స్‌కు కో-ఓనర్‌గా వ్యవహరిస్తోంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు మద్దతుగా స్టాండ్స్‌లో సందడి చేయనుంది. ఐపీఎల్ 2025 సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ తమ జట్టును పూర్తిగా మార్చేసింది. హెడ్ కోచ్‌గా రికీ పాంటింగ్‌ను నియమించుకున్న ఆ జట్టు.. శ్రేయస్ అయ్యర్‌ను సారథిగా ఎంపిక చేసింది. అతన్ని వేలంలో రూ. 26.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

Story first published: Tuesday, February 25, 2025, 15:45 [IST]
Other articles published on Feb 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+