Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 WC 2024: ఈ సారి అతను ఉన్నాడు.. టీమిండియాదే విజయం: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

టీ20 ప్రపంచకప్ 2024లో వరుస విజయాలతో సెమీస్ చేరిన టీమిండియా కీలక మ్యాచ్‌కు సన్నదమవుతోంది. గురువారం గయానా వేదికగా జరిగే సెమీఫైనల్-2లో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. గత టీ20 ప్రపంచకప్‌ 2024లోనూ భారత్ వర్సెస్ ఇంగ్లండ్ సెమీఫైనల్లోనే తలపడ్డాయి. 10 వికెట్లతో టీమిండియాను ఓడించి ఫైనల్ చేరిన ఇంగ్లండ్.. పాకిస్థాన్‌పై గెలిచి టైటిల్‌ను అందుకుంది.

డిఫెండింగ్ ఛాంపియన్‌గా తాజా ఎడిషన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్‌ తడబడుతూనే సెమీస్ చేరింది. ఈ క్రమంలోనే సెమీఫైనల్-2‌లో టీమిండియా.. హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా మరో ఐసీసీ టైటిల్ గెలవలేదు. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఓటమిపాలై త‌ృటిలో టైటిల్‌ను అందుకోలేకపోయింది.

Paul Collingwood says I can t see India losing ahead of crucial semifinal

గత సెమీఫైనల్లో ఇంగ్లండ్ విజయం సాధించినా ఈ సారి టీమిండియా గెలుస్తుందని ఆ జట్టు మాజీ కెప్టెన్ పాల్ కోలింగ్‌వుడ్ జోస్యం చెప్పాడు. ఈసారి టీమిండియా జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నాడని, అతను ఒంటి చేత్తో టీమిండియాను గెలిపిస్తాడని చెప్పాడు.

'టీమిండియా సూపర్ ఫామ్‌లో ఉంది. ముఖ్యంగా జస్‌ప్రీత్ బుమ్రా అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతను సూపర్ ఫిట్‌‌గా ఉండటంతో పాటు ఖచ్చితమైన వేగంతో బంతులు సంధిస్తున్నాడు. అసాధారణ నైపుణ్యం కలిగిన బౌలర్ అతను. ఏ జట్టు కూడా అతని బౌలింగ్‌కు సమాధానం చెప్పేలా కనిపించడం లేదు.

120 బంతుల మ్యాచ్‌ల్లో బుమ్రా 24 బంతులు భారీ తేడా చూపించనున్నాయి. టీమిండియా కూడా చాలా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. అమెరికా వంటి కఠిన పిచ్‌లపై అద్భుతంగా ఆడింది. వారి బ్యాటర్లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. నిజాయితీగా చెప్పాలంటే ఈ సారి టీమిండియా ఓటమిని నేను చూడలేను. భారత్‌ను ఓడించాలంటే ఇంగ్లండ్ అసాధారణ ప్రదర్శన చేయాలి.

టీమిండియా తమ అప్రోచ్‌ను కూడా పూర్తిగా మార్చింది. గతంలో భారత్ ఆరంభంలో దూకుడగా ఆడేది. 2022 ప్రపంచకప్‌లోనూ ముందుగా బ్యాటింగ్ చేసి ఇలానే ఆడింది. తొలి 10 ఓవర్లు దూకుడుగా ఆడి ఆ తర్వాత నిదానంగా ఆడింది. కానీ ఇప్పుడు ఆ అప్రోచ్‌ను మార్చేసింది. ఈ వ్యూహంతో ప్రపంచకప్ గెలవలేమనే విషయాన్ని టీమిండియా గ్రహించింది. రిస్క్ తీసుకోవడంతో పాటు దైర్యంగా ఉంటూ.. స్వేచ్చగా ఆడాల్సిన అవసరం టీమిండియాకు ఉంది.'అని కోలింగ్‌ వుడ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, June 26, 2024, 16:54 [IST]
Other articles published on Jun 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+