ఆ నిర్ణయమే మా కొంప ముంచింది: ప్యాట్ కమిన్స్
లక్నో: టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయడం తమ కొంప ముంచిందని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. మైదాన పరిస్థితులను సరిగ్గా అంచనా వేయకపోవడం తమ ఓటమిని శాసించిందని చెప్పాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా సౌతాఫ్రికాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 134 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఘోర పరాజయంపై స్పందించిన ప్యాట్ కమిన్స్.. అండర్ లైట్స్ కింద పిచ్ బౌలింగ్‌కు సహకరించిందని, బంతి ఆగుతూ రావడంతో బ్యాటింగ్‌కు కష్టమైందని తెలిపాడు. టాస్‌తో సంబంధం లేకుండా ముందుగా బ్యాటింగ్ చేసినా.. బౌలింగ్ చేసినా విజయాలు సాధించే మార్గాన్ని తమ జట్టు వీలైనంత త్వరగా కనుగొనాలని అభిప్రాయపడ్డాడు.

'క్వింటన్ డికాక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మాకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగాడు. అయితే అతను శతక్కొట్టినా మేం సౌతాఫ్రికాను 310 పరుగులకే పరిమితం చేశాం. ఇది సునాయసంగా చేధించే లక్ష్యమని అనుకున్నాను. కానీ అండర్ లైట్స్ కింద బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైంది.
పైగా పిచ్ నుంచి లభించిన సహకారంతో సాఫారీ బౌలర్లు చెలరేగారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేయడమే ఈజీగా అనిపించింది. ఈ టోర్నీలో మేం ప్రత్యర్థి జట్లకు సవాల్‌గా నిలవాలంటే టాస్‌తో సంబంధం లేకుండా విజయాలు సాధించే మార్గాలను కనుగొనాలి. ఈ ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ప్రతీ ఒక్కరు బాధపడుతున్నారు. మాకు తదుపరి మ్యాచ్‌కు కాస్త విశ్రాంతి దొరికింది. మా తప్పిదాలను మెరుగుపరుచుకొని నేలకు కొట్టిన బంతిలా పుంజుకుంటాం.'అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 311 పరుగులు భారీ స్కోర్ చేసింది. క్వింటన్ డికాక్ (106 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 109) సెంచరీ నమోదు చేయగా.. ఎయిడెన్ మార్క్‌రమ్(44 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో గ్లేన్ మ్యాక్స్‌వెల్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, జోష్ హజెల్ వుడ్, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఆస్ట్రేలియా సౌతాఫ్రికా పేసర్ల ధాటికి 40.5 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. ఆసీస్ బ్యాటర్లలో మార్నస్ లబుషేన్(74 బంతుల్లో 3 ఫోర్లతో 46) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడా(3/33) మూడు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్(2/54), కేశవ్ మహరాజ్(2/30), టబ్రైజ్ షంసీ(2/38) రెండేసి వికెట్లు దక్కించుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications