ఒలింపిక్స్ ఫైనల్లో కూడా ఒక్క మ్యాచే ఉంటుంది.. రోహిత్ శర్మకు ప్యాట్ కమిన్స్ కౌంటర్!
లండన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజేతను ఒక్క మ్యాచ్‌తో తేల్చడం సరికాదన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ భిన్నంగా స్పందించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ను మూడు మ్యాచ్‌ల సిరీస్‌తో కాకపోతే 16 టెస్ట్‌ల సిరీస్‌తో నిర్ణయించినా తమకు అభ్యంతరం లేదన్నాడు. కాకపోతే ఒలింపిక్స్ ఫైనల్లో కూడా ఒక్క మ్యాచ్‌తోనే విజేతను నిర్ణయిస్తారని తెలిపాడు.
భారత్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆసీస్ 209 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో తొలి డబ్ల్యూటీసీ టైటిల్ గెలుచుకున్న ఆస్ట్రేలియా.. క్రికెట్‌లో ఉన్న అన్నీ ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న తొలి జట్టుగా చరిత్రకెక్కింది.

ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ.. రెండేళ్ల పాటు సాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజేతను ఒక్క మ్యాచ్‌తో తేల్చడం సరికాదన్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌తో విజేతను తేల్చడం ఆదర్శంగా ఉంటుందని ప్రతిపాదించాడు. అయితే ఈ ప్రతిపాదనను ప్యాట్ కమిన్స్ ముందు ప్రస్తావించగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'మేం ఇప్పటికే డబ్ల్యూటీసీ ట్రోఫీని గెలుచుకున్నాం. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ను 3 మ్యాచ్‌ల సిరీస్‌తో కాకపోతే 16 మ్యాచ్‌ల సిరీస్‌తో నిర్వహించవచ్చు. ఒలింపిక్స్ ఫైనల్లో కూడా ఒకే మ్యాచ్‌తో ఆటగాళ్లు పతకాలు సాధిస్తారు.'అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.
అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌ను మూడు మ్యాచ్‌ల సిరీస్ ఫార్మాట్‌లో నిర్వహించాలనే ప్రతిపాదన రావడం ఇదే తొలిసారి కాదు. డబ్ల్యూటీసీ 2019-21 ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిన తర్వాత అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ, రవి శాస్త్రి ఇవే వ్యాఖ్యలు చేశారు. కానీ ఐసీసీ పట్టించుకోలేదు. ఆ దిశగా బీసీసీఐ కూడా ఒత్తిడి చేయలేదు. దాంతో అంతా మరిచిపోయారు.
తీరా రెండేళ్ల తర్వాత టీమిండియా మళ్లీ ఫైనల్లో ఓడిపోవడంతో ఈ ప్రతిపాదనను మళ్లీ తీసుకొచ్చారు. అయితే ఈ పద్దతిని కొందరు ఆహ్వానిస్తుంటే మరికొందరు మాత్రం తప్పుబడుతున్నారు. ఓటమికి ఇదో సాకుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారని కొందరంటే.. రెండేళ్ల పాటు జరిగే టోర్నీలో విజేతను ఒక్క మ్యాచ్‌తో తేల్చడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అప్‌కమింగ్ సైకిల్‌లోనైనా ఐసీసీ ఈ ప్రతిపాదనను సీరియస్‌గా తీసుకుంటుందో లేదో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications