Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs SRH: అందుకే మయాంక్ అగర్వాల్‌ను తీసుకున్నాం: ప్యాట్ కమిన్స్

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. ఇది చాలా ఫ్రెష్ వికెట్. కొత్త బంతితో పేసర్లకు అడ్వాంటేజ్ లభించనుంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే బౌలింగ్ ఎంచుకున్నా. మా జట్టు తరఫున యువ ప్లేయర్ అన్షుల్ కంబోజ్ అరంగేట్రం చేస్తున్నాడు. మేం ఆడేది పరువు కోసమే. మా పేరు నిలబెట్టుకోవడానికి. కష్టాల్లోనూ మాకు అండగా నిలిచిన అభిమానులను సంతోషపరిచేందుకు ఆడుతున్నాం.'అని హార్దిక్ పాండ్యా తెలిపాడు.

Pat Cummins says Mayank Agarwal coming back to the side will bat at three during MI vs SRH IPL 2024

మరోవైపు తమ జట్టులోనూ కీలక మార్పు చేశామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. మయాంక్ అగర్వాల్ తుది జట్టులోకి వచ్చాడని చెప్పాడు. 'మయాంక్ అగర్వాల్ రీఎంట్రీ ఇచ్చాడు. అతను మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఈ మ్యాచ్‌లో డ్యూ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

అయితే మేం బాగా ఆడి భారీ లక్ష్యాన్ని నమోదు చేస్తాం. మాకు ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఉన్నాయి. ప్లే ఆఫ్స్ చేరాలంటే మేం కనీసం రెండు గెలవాలి. అయితే మేం దాని గురించి పెద్దగా ఆలోచించడం లేదు.'అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, నితీష్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్(కీపర్), అబ్దుల్ సమద్, షెహ్‌బాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్

ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్, అన్షుల్ కంబోజ్, పియూష్ చావ్లా, జస్‌ప్రీత్ బుమ్రా, నువాన్ తుషారా

Story first published: Monday, May 6, 2024, 19:24 [IST]
Other articles published on May 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+