Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌తో నా జీవితంలో పెద్దగా మార్పులేవీ చోటుచేసుకోలేదు: స్టార్ పేసర్

Pat Cummins Says Life Hasnt Changed Much Despite Record IPL 2020 Deal

సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌తో తన జీవితంలో పెద్దగా మార్పులేవీ చోటుచేసుకోలేదు అని ఆస్ట్రేలియా స్టార్ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్ తెలిపాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌కు సంబంధించి గతేడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో కమిన్స్‌ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మిగతా జట్లతో పోటీపడి మరి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అతడిని 15.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడంతో.. లీగ్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

ఐపీఎల్‌తో మార్పులేవీ లేవు

ఐపీఎల్‌తో మార్పులేవీ లేవు

పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్యాట్‌ కమిన్స్ మాట్లాడుతూ... 'నేను ప్రతీ గేమ్‌ను ఎంతో ఆస్వాదిస్తా. అది టెస్టు ఫార్మాట్‌ అయినా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ అయినా నా గేమ్‌ ఒక్కటే.ఎప్పుడూ కూడా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ఈ క్రమంలోనే వచ్చిన సక్సెస్‌, ప్రతికూల ఫలితాలు నన్ను పెద్దగా ప్రభావితం చేయవు. నేను రెండింటినీ ఒకేలా చూస్తా. ఒక ఎత్తుకు ఎదిగి మళ్లీ కిందికి పడిపోయినా బాధపడను. గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో నాకు భారీ ఆఫర్ వచ్చింది. అయినా నేను అలానే ఉన్నాను. ఐపీఎల్‌తో నా జీవితంలో పెద్దగా మార్పులేవీ చోటుచేసుకోలేదు' అని తెలిపాడు.

కోహ్లీ తరహాలో నేను కూడా

కోహ్లీ తరహాలో నేను కూడా

చాలా మంది క్రికెటర్లు టీ20 లీగ్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంపై ప్యాట్‌ కమిన్స్‌ స్పదించాడు. 'నేను ఎప్పుడూ ఓల్డ్‌ బ్లాక్‌నే. నాకు టెస్టు ఫార్మాట్‌ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటినుంచి సుదీర్ఘ ఫార్మాట్‌ను చూస్తూ పెరిగా. అందుకే టెస్ట్ ఫార్మాట్‌ అంటే నాకు చాలా ఇష్టం. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టెస్టు ఫార్మాట్‌కు ఎంతటి విలువ ఇస్తాడో.. అదే తరహాలో నేను కూడా సుదీర్ఘ ఫార్మాట్‌ను అత్యంత గౌరవంగా భావిస్తా. నాకు ప్రతీ టెస్టు మ్యాచ్‌ అత్యధిక సంతృప్తిని ఇస్తుంది' అని ఆసీస్ పేసర్‌ చెప్పాడు.

ప్రాక్టీస్‌ ప్రారంభించా

ప్రాక్టీస్‌ ప్రారంభించా

'మేము క్రికెట్‌ను ఆరంభించానికి ఇంకా సమయం ఉన్నందుకు చాలా లక్కీ. ఇప్పటికే క్రికెట్‌ ప్రాక్టీస్‌ను ప్రారంభించా. టీ20 ఫార్మాట్‌ శారీరంగా సిద్ధం కావడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇక మన జీవితంలో చిన్న చిన్న సర్దుబాట్లు సహజం. ఉద్యోగాల్లో కూడా అంతే. కానీ క్రీడల్లో సర్దుబాటుతో మాత్రం ఆడలేం. గేమ్‌లో ఎక్కువ సర్దుబాటు అనేది ఉండదని నా అభిప్రాయం' అని 27 ఏళ్ల కమిన్స్‌ పేర్కొన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో కమిన్స్‌ ఇప్పటివరకు 30 టెస్టుల్లో, 64 వన్డేల్లో, 28 టీ20 మ్యాచ్‌ల్లో ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

ఐపీఎల్‌ జరగాలని కోరుకుంటున్నా

ఐపీఎల్‌ జరగాలని కోరుకుంటున్నా

ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడితే.. దాని స్థానంలో ఐపీఎల్‌ 2020 సీజన్‌ నిర్వహిస్తే బాగుంటుందని ఇప్పటికే ప్యాట్‌ కమిన్స్‌ అభిప్రాయపడ్డాడు. 'టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడితే.. దాని స్థానంలో ఐపీఎల్‌ 2020 నిర్వహిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అయితే ఐపీఎల్‌ జరుగాలని నేను కోరుకునేందుకు చాలా కారణాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఈ టోర్నీని చూస్తారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా క్రికెట్‌ చాలా కాలంగా నిలిచిపోయింది. ఈ సమయంలో ఐపీఎల్‌ జరిగితే ఎక్కువ ఆదరణ లభిస్తుంది. ఈ టోర్నీ చాలా గొప్పది' అని పేర్కొన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ మార్చి 29వ తేదీన ఆరంభం కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదాలు పడుతూ వస్తుంది. ఇప్పటికైతే ఐపీఎల్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయినా.. ఆ లీగ్‌ జరుగుతుందని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.

సచిన్‌‌కు బౌలింగ్‌ చేయడం చాలా కష్టం: మాజీ పేసర్

Story first published: Monday, July 6, 2020, 13:54 [IST]
Other articles published on Jul 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+