Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్‌‌కు బౌలింగ్‌ చేయడం చాలా కష్టం: మాజీ పేసర్

Ian Bishop says Sachin Tendulkar one of the most difficult batsmen I’ve ever bowled

ఆంటిగ్వా: తాను ఎదుర్కొన్న బ్యాట్స్‌మన్‌లలో క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు బౌలింగ్‌ చేయడం కష్టతరమని వెస్టిండీస్‌ మాజీ పేసర్‌, వ్యాఖ్యాత ఇయాన్‌ బిషప్‌ పేర్కొన్నాడు. తనదైన బ్యాటింగ్‌తో రెండు దశాబ్దాలకుపైగా ప్రపంచ క్రికెట్‌ను శాసించిన దిగ్గజ బ్యాట్సమన్, లిటిల్ ‌మాస్టర్‌‌ సచిన్‌ మాత్రమే తనకు ప్రత్యేకంగా కనిపించాడని తెలిపాడు. 1980 చివర్లో, 90ల్లో బిషప్‌ ఎంతో మంది దిగ్గజ బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్‌ చేశాడు.

తాజాగా 'క్రికెట్‌ కనెక్టెడ్‌' కార్యక్రమంలో ఇయాన్‌ బిషప్‌ మాట్లాడుతూ... 'నా కెరీర్‌లో నేను బౌలింగ్‌ చేసిన అత్యంత కష్టతరమైన బ్యాట్స్‌మెన్‌లో సచిన్‌ ఒకడు. అతనెప్పుడూ స్ట్రైట్ ‌డ్రైవ్‌లు ఆడతాడు. తన టెక్నిక్‌తో స్ట్రైట్‌ డ్రైవ్‌లు ఆడే సామర్థ్యంతో బంతిని బౌలర్‌ వెనక్కి పంపిస్తాడు' అని బిషప్‌ తన అనుభవాల్ని గుర్తుచేసుకున్నాడు. సచిన్‌‌తో కలిసి బిషప్‌ మొత్తం 9 మ్యాచ్‌లు ఆడాడు. వాటిలో నాలుగు టెస్టులు కాగా ఐదు వన్డేలు ఉన్నాయి. కేవలం మూడు సార్లు మాత్రమే సచిన్‌‌ను బిషప్‌ ఔట్‌ చేశాడు. అందులో రెండుసార్లు సచిన్‌ శతకానికి చేరువైనప్పుడు కావడం విశేషం.

టీమిండియా పేస్‌ దళంపై వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ ఇయాన్‌ బిషప్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుత భారత పేస్‌ దళం ఒకప్పటి కరీబియన్‌ పేసర్లను గుర్తుకు తెస్తోందన్నారు. 'ప్రస్తుత టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ ఉత్తమం. మంచి ప్రతిభావంతులు ఉన్నారు. కపిల్ ‌దేవ్‌, జవగళ్‌ శ్రీనాథ్‌ తర్వాత జహీర్‌ ఖాన్‌, ఆర్పీసింగ్‌, మునాఫ్‌ పటేల్‌ వంటి పేసర్లు వచ్చారు. ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, భువనేశ్వర్‌ కుమార్, ఇషాంత్ శర్మ‌. ఎప్పట్నుంచో టీమిండియాకు అద్భుతమైన పేసర్లు ఉన్నప్పటికీ ఒక దళంగా మాత్రం లేరు. ఇప్పుడు బాగుంది' అని బిషప్‌ అన్నాడు.

'టీమిండియా పేస్ విభాగం పటిష్టంగా ఉంది. ఇందుకు బుమ్రా కూడా ఓ కారణం. అతడు బాగా బౌలింగ్ చేస్తున్నాడు. కానీ అతడు ప్రతి ఫార్మాట్‌లో ఆడుతున్నాడు కాబట్టి.. గత మ్యాచ్ ప్రదర్శనే మనం ఆశించలేం. ఒక్కోసారి శరీరం సహకరించదు. ఏదేమైనా బుమ్రాలో చాలా టాలెంట్ ఉంది. ఈ రోజుకీ బుమ్రాకు అంత వేగం ఎలా వస్తుందో అర్ధం కావట్లేదు. బంతిని స్వింగ్‌ చేసే విధానం, నియంత్రణ చాలా బాగుంటుంది. ఫిట్‌గా ఉంటే అతడికి తిరుగులేదు' అని బిషప్‌ చెప్పాడు. బిషప్‌ విండీస్ తరఫున 43 టెస్టులు, 84 వన్డేలు ఆడాడు.

Story first published: Monday, July 6, 2020, 13:26 [IST]
Other articles published on Jul 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+