For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓడిపోతే అందరూ సుద్దపూసలే: ప్యాట్ కమిన్స్

న్యూఢిల్లీ: క్రీడా స్పూర్తికి విరుద్దంగా వ్యవహరించారని వస్తున్న విమర్శలపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఘాటుగా స్పందించాడు. ఓడిపోయిన తర్వాత అందరూ సుద్దపూస మాటలే మాట్లాడుతారని బదులిచ్చాడు. జానీ బెయిర్ స్టో స్టంపౌట్‌ అనైతికమని గగ్గోలు పెడుతున్నవారందరూ.. ఇది నిబంధనల్లో ఉన్నదేననే విషయం తెలుసుకోవాలని హితవు పలికాడు.

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 43 పరుగులు తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో స్టంపౌట్ అయిన విధానం వివాదాస్పదమైంది.

Pat Cummins says Jonny Bairstow had attempted the same move when keeping himself

సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేగుతోంది. క్రీడా స్పూర్తికి విరుద్దంగా ఆసీస్ ఈ వికెట్ తీసిందని ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సైతం తాను అప్పీల్‌ను వెనక్కు తీసుకునేవాడినని, ఇలా గెలవడం కంటే ఓడిపోవడం ఉత్తమమని కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కమిన్స్.. 2019లో ఇదే పద్దతిలో స్టీవ్ స్మిత్‌ను జానీ బెయిర్ స్టో ఔట్ చేశాడని గుర్తు చేశాడు.

'బెయిర్ స్టోను అప్పటికప్పుడు అలా స్టంపౌట్ చేయలేదు. అతను కీపర్ చేతుల్లోకి బంతి రాకముందే క్రీజును వీడుతున్నాడనే విషయాన్ని అలెక్స్ క్యారీ గుర్తించాడు. అప్పటికే చాలా సార్లు బెయిర్ స్టో అలా చేశాడు. బంతి చేతుల్లోకి రాగానే స్టంప్స్‌పైకి విసిరేసాడు. ఎక్కడా కూడా ఆగలేదు. ఇది ఏ మాత్రం అనైతికం కాదు. ఇలా ఔట్ చేయవచ్చని నిబంధనల్లో ఉంది.

కొందరికి ఇది నచ్చడం లేదు. కీపర్‌గా జానీ బెయిర్ స్టో కూడా గతంలో ఇలా స్టంపౌట్ చేశాడు. ఈ మ్యాచ్‌ తొలి రోజు డేవిడ్ వార్నర్‌ను ఇలానే ఔట్ చేసేందుకు ప్రయత్నించాడు. 2019లో స్టీవ్ స్మిత్‌ను ఇలానే పెవిలియన్‌కు చేర్చాడు. బ్యాటర్లు క్రీజు ధాటితే ఔట్ చేయడం కీపర్లు సర్వసాధారణం. అలెక్స్ క్యారీ‌దే పూర్తి క్రెడిట్. అతనికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. అయినా అంపైర్లే ఔటిచ్చారు కదా?'అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.

చివరి రోజు తొలి సెషన్‌ ఆటలో ఇంగ్లండ్‌ 193/5గా ఉన్న సమయంలో.. కామెరూన్ గ్రీన్‌ బౌన్సర్‌ను తప్పించుకునేందుకు బెయిర్ స్టో కిందకు వంగాడు. బంతి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లోకి వెళ్లగా.. ఓవర్ పూర్తయిందనే ఆలోచనతో నాన్ స్ట్రైకర్ బెన్ స్టోక్స్‌ను కలిసేందుకు జానీ బెయిర్ స్టో క్రీజును వీడాడు. వెంటనే కీపర్ బంతిని వికెట్లకు కొట్టి గట్టిగా అప్పీల్ చేశాడు.

బంతి కీపర్ చేతుల్లో ఉండగానే జానీ బెయిర్ స్టో క్రీజును ధాటడంతో థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. బెయిర్‌స్టో పరుగు తీసేందుకు ప్రయత్నించలేదు కాబట్టి ఔటివ్వడం కరెక్ట్ కాదని ఇంగ్లండ్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Story first published: Monday, July 3, 2023, 11:10 [IST]
Other articles published on Jul 3, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+