Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హైదరాబాద్ ఫ్యాన్స్ అభిమానం అద్భుతం: ప్యాట్ కమిన్స్ (వీడియో)

హైదరాబాద్ ఫ్యాన్స్ అభిమానం అద్భుతమని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకు ఆడుతున్నప్పుడు ఆ జట్టు అభిమానులు చూపించిన అభిమానం మరిచిపోలేనన్నాడు. ఇప్పటి వరకు తన జీవితంలో ఇలాంటి క్రేజీ ఫ్యాన్స్‌ను చూడలేదన్నాడు. జట్టు కోసం ఓ నగరమే అండగా నిలవడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు.

భారత్‌తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన ప్యాట్ కమిన్స్.. సన్‌రైజర్స్ అభిమానులపై ప్రశంసల జల్లు కురిపించాడు. హైదరాబాద్ ఫ్యాన్స్ అభిమానం వేరే లెవల్ అని చెప్పుకొచ్చాడు.

Pat Cummins says Hyderabad was crazy this year of SRH and never experienced that

'హైదరాబాద్‌లో ఈ ఏడాది ఐపీఎల్ చాలా క్రేజీగా అనిపించింది. సన్‌రైజర్స్ టీమ్‌ను ఆ నగర అభిమానులు వేరే స్థాయిలో అభిమానిస్తారు. నేను ఐపీఎల్ తక్కువగా ఆడటంతో గతంలో ఈ స్థాయి అభిమానాన్ని చూడలేదు. మా జట్టుకు దన్నుగా ఓ నగరమే ఉండటం ఆశ్చర్యానికి గురి చేసింది. హైదరాబాద్ ఫ్యాన్స్ అభిమానం అద్భుతం. వారి అభిమానం నా మనసును హత్తుకుంది.'అని ప్యాట్ కమిన్స్ తెలిపాడు.

ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు జరిగిన మినీ వేలం ప్యాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. జట్టు సారథ్య బాధ్యతలను కూడా కట్టబెట్టింది. అతని సారథ్యంలో అసాధారణ ప్రదర్శన కనబర్చిన ఆరెంజ్ ఆర్మీ.. ఫైనల్ చేరి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. కేకేఆర్ చేతిలో ఓటమిపాలైంది.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి ప్యాట్ కమిన్స్‌ను రిటైన్ చేసుకుంది. రూ. 18 కోట్లకే తమ కెప్టెన్‌ను అట్టిపెట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ.. విధ్వంసకర వికెట్ కీపర్ హెన్రీచ్ క్లాసెన్‌‌ను అత్యధికంగా రూ.23 కోట్లకు తీసుకుంది. బిగ్ హిట్టింగ్ ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలను రూ. 14 కోట్ల చొప్పున రిటైన్ చేసుకుంది.

యువ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిని రూ. 6 కోట్లకే తీసుకుంది. రిటెన్షన్‌కే ఆ జట్టు రూ. 75 కోట్లు ఖర్చు చేయడంతో పర్స్‌‌లో ఇంకా రూ. 45 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఈ డబ్బుతోనే సన్‌రైజర్స్ మిగతా టీమ్‌ను నిర్మించాల్సి ఉంది. ఐదుగురిని మాత్రమే రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక ఆర్‌టీమ్ కార్డు ఉంది. అయితే ఆర్‌టీమ్ కార్డ్ కింద అనామక ప్లేయర్‌ను మాత్రమే తీసుకోవాల్సి ఉంది.

Story first published: Tuesday, November 12, 2024, 11:12 [IST]
Other articles published on Nov 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+