Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs DC: ఓడినా.. ఆదరిస్తున్నారు: ప్యాట్ కమిన్స్

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. ఆశించిన ఫలితాలు సాధించకున్నా అభిమానులు ఆదరిస్తున్నారని చెప్పాడు.

'మేము ముందుగా బౌలింగ్ చేస్తాము. మేము కొన్ని విషయాల గురించి చర్చించాము. ఇంకా పూర్తి ఆట ఆడలేదు. మా బేసిక్స్‌ను సవరించాలనుకుంటున్నాం. జట్టులో ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నరే. మాకు డీప్ బ్యాటింగ్ లైనప్ ఉంది. అభిమానుల మద్దతు అద్భుతం. ఆశించిన ఫలితాలు రాకున్నా.. ప్రేక్షకులు అండగా నిలవడం గొప్ప విషయం. మెరుగైన ప్రదర్శన చేసే ప్రయత్నం చేస్తాం.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.

Pat Cummins says fans support has been amazing after SRH opt to bowl vs DC in IPL 2025

టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బౌలింగ్ చేసేవాళ్లమని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ తెలిపాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. పిచ్ చూడటానికి బాగుంది. వికెట్‌లో పెద్దగా మారే అవకాశం లేదు. మేం మెరుగైన లక్ష్యాన్ని నమోదు చేసి.. సన్‌రైజర్స్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేస్తాం. టోర్నీలో ఇది చివరి దశ. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లు.

మేం జట్టు వాతావారణాన్ని తేలికగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. టోర్నీ ఆరంభంలో ఈ విషయాలు మాట్లాడుకోలేదు. మెరుగైన ప్రదర్శన చేశాం. అదే మైండ్‌సెట్‌తో అప్‌కమింగ్ మ్యాచ్‌లు గెలవాలనుకుంటున్నాం. మాపై ఒత్తిడి లేకుండా చూసుకుంటాం. మూమెంటమ్‌ను కొనసాగించడం కీలకం. ఉత్కంఠ మ్యాచ్‌లు ఆడాలనుంది. ఇలాంటి మ్యాచ్‌లు ఓడినా.. భారీ తేడాతో ఓడిపోం. ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం.

తుది జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(కీపర్), సచిన్ బేబీ, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగ

ఢిల్లీ క్యాపిటల్స్: ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, టీ నటరాజన్

Story first published: Monday, May 5, 2025, 19:22 [IST]
Other articles published on May 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+