Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: ప్యాట్ కమిన్స్

చెన్నై: పేలవ బ్యాటింగ్ కారణంగానే వన్డే ప్రపంచకప్ 2023లో శుభారంభం చేయలేకపోయామని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. టీమిండియాతో ఆదివారం జరిగిన లోస్కోరింగ్ థ్రిల్లర్‌లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన కమిన్స్.. బ్యాటింగ్‌లో 50 పరుగులు అదనంగా చేసుంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు.

కోహ్లీ క్యాచ్ నేలపాలు చేయడం వల్లే మ్యాచ్ ఓడిపోలేదని, అతని క్యాచ్ పట్టుంటే మెరుగైన అవకాశాలుండేవని అభిప్రాయపడ్డాడు. 'బ్యాటింగ్‌లో మేం 50 పరుగులు తక్కువగా చేశాం. 200 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం కష్టమైంది. బలమైన భారత బౌలింగ్‌ అటాక్‌ను ఎదుర్కోలేకపోయాం.

Pat Cummins says 50 runs short with the bat after India beat Australia in World Cup 2023

ముఖ్యంగా స్పిన్నర్లను ఆడటం కష్టమైంది. ఈ తరహా వికెట్‌పై బ్యాటింగ్ చేయాలంటే క్రీజులో సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకోవాలి. విరాట్ కోహ్లీ క్యాచ్‌ను వదిలేయడాన్ని నేను మరిచిపోయాను. ఈ స్థాయి టోర్నీలో అలాంటి క్యాచ్‌‌లను వదిలేయడం సరికాదు. అయితే ఆ క్యాచ్‌ను అందుకోకపోవడం వల్లనే ఓడిపోలేదు. ఆ క్యాచ్ పట్టుంటే పరిస్థితులు మాకు అనుకూలంగా ఉండేవి.

పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోతే భారత బ్యాటర్లు ఒత్తిడికి లోనయ్యేవారు. జోష్ హజెల్ వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బంతితో బ్యాటర్లకు ప్రశ్నలు వేసాడు. ఈ ఓటమిపై సమీక్ష జరుపుతాం. ఇది కఠినమైన పిచ్. 9 మ్యాచ్‌ల్లో ఇదొక మ్యాచ్. దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడంపై ఎలాంటి పశ్చాతాపం లేదు.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 199 పరుగులకు కుప్పకూలింది. స్టీవ్ స్మిత్(71 బంతుల్లో 5 ఫోర్లతో 46), డేవిడ్ వార్నర్(52 బంతుల్లో 6 ఫోర్లతో 41) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివర్లో మిచెల్ స్టార్క్(35 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 28) విలువైన పరుగులు జోడించాడు.

భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/28) మూడు వికెట్లుతీయగా.. కుల్దీప్ యాదవ్(2/42), జస్‌ప్రీత్ బుమ్రా(2/35) రెండేసి వికెట్లు తీసారు. మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 41.2 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ(116 బంతుల్లో 6 ఫోర్లతో 85), కేఎల్ రాహుల్(115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 97 నాటౌట్) చెలరేగారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్ ఓ వికెట్ తీసాడు.

Story first published: Sunday, October 8, 2023, 22:34 [IST]
Other articles published on Oct 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+