Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Pat Cummins: అతనే మా ఓటమిని శాసించాడు

వెస్టిండీస్ యువ ప్లేయర్ షామర్ జోసెఫ్ అసాధారణ ప్రదర్శనతో తమ ఓటమిని శాసించాడని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. బ్రిస్బేన్ వేదికగా హోరాహోరీగా సాగిన రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియాను 8 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఓడించింది. తద్వారా 30 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్ట్ విజయాన్ని అందుకుంది.

ఈ గెలుపుతో రెండు టెస్ట్‌ల సిరీస్ 1-1తో సమమైంది. ఈ మ్యాచ్‌లో షామర్ జోసెఫ్ (7/68) రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. బ్యాటింగ్ సందర్భంగా మిచెల్ స్టార్క్ వేసిన యార్కర్‌కు అతని బొటన వేలు విరగ్గా.. గాయంతోనే బౌలింగ్ చేసి ఆసీస్‌పై సంచలన విజయాన్నందించాడు.

Pat Cummins Reveals The Reason Why Australia loss in 2nd Test vs West Indies


ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ప్యాట్ కమిన్స్.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలిచిన షామర్ జోసెఫ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. అద్భుతంగా బౌలింగ్ చేసాడని కొనియాడాడు. ఈ పరాజయం తీవ్ర నిరాశకు గురి చేసిందని చెప్పిన కమిన్స్.. ఈ ఓటమి తమకు ఓ గుణపాఠమని చెప్పాడు.

'ఈ ఓటమి తీవ్రంగా నిరాశపరిచింది. కానీ అద్భుతమైన టెస్ట్ మ్యాచ్‌, సిరీస్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా షామర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దురదృష్టవశాత్తు మేం ఈ రోజు మా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదు. విజయం సాధిస్తామనే నమ్మకంతో ఈ రోజు మా ఆటను ప్రారంభించాం.

నిన్న మేం అద్భుతంగా ఆడాం. 216 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా చేధిస్తామని భావించాం. కానీ వెస్టిండీస్ భిన్నమైన ఆలోచనలతో బౌలింగ్ చేసి మమ్మల్ని కట్టడి చేసింది. భాగస్వామ్యాలను నెలకొల్పకుండా మమ్మల్ని అడ్డుకుంది. స్మిత్ ఒంటరి పోరాటం చేయడం ఇదే తొలిసారి కాదు.

గత 15 ఏళ్లుగా అతను ఇలానే అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. అతనో అసాధారణమైన ఆటగాడు. ఒంటరి పోరాటంతో దాదాపు మమ్మల్ని విజయానికి చేరువగా తీసుకొచ్చాడు. మేం చాలా క్రికెట్ ఆడినా.. వరల్డ్ నెంబర్ వన్‌గా ఉన్నా..కొన్నిసార్లు ఇలాంటి ఫలితాలు ఎదురవుతాయి.

ఈ వారం వెస్టిండీస్ మా కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. అసాధారణ ఆటతీరుతో మమ్మల్ని అధిగమించింది. కొన్నిసార్లు ఇలాంటి గుణపాఠాలు ఎదురవుతాయి. న్యూజిలాండ్ పర్యటనకు ముందు మాకు నెల రోజుల విశ్రాంతి ఉంది. విదేశీ పర్యటన ఏదైనా కష్టంగానే ఉంటుంది. ఆ పర్యటన కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, January 28, 2024, 14:55 [IST]
Other articles published on Jan 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+