Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs RR: అందుకే మార్క్‌రమ్‌ను తీసుకున్నాం: ప్యాట్ కమిన్స్

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెపాక్ మైదానం కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. చెపాక్ కండిషన్స్ సెకండ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య పరంగా మేం పూర్తిగా కోలుకునే ప్రయత్నం చేశాం. మా డాక్టర్లు అసాధారణ పనితీరు కనబర్చారు. ప్రస్తుతం మేం చాలా మెరుగ్గా ఉన్నాం. మా బ్యాటింగ్ సత్తాలో 70 శాతం చూపించినా.. ఈ మ్యాచ్‌ను సునాయసంగా గెలుస్తాం.

Pat Cummins Reveals The Reason Why Aiden Markram Included SRH Playing XI in IPL 2024 Qualifier-2 vs RR

మేం జట్టుగా చాలా మెరుగయ్యాం. ఈ వేదికను దృష్టిలో పెట్టుకొనే సన్నదమయ్యాం. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగిస్తున్నాం.'అని సంజూ శాంసన్ తెలిపాడు.

టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. 'టాస్ ఓడినందుకు బాధలేదు. గెలిస్తే ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. మా ఆటగాళ్లు చాలా దూకుడుగా ఆడాలనుకుంటున్నారు. అయితే ప్రతీసారి దూకుడు పనికిరాదు. కొన్నిసార్లు వికెట్లు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

గత మ్యాచ్‌లో మేం అద్భుతంగా బౌలింగ్ చేశాం. ఈ మ్యాచ్‌ మాకు మరో అవకాశం. మరోసారి సాయశక్తులా విజయం కోసం ప్రయత్నిస్తాం. అయితే ఈ వికెట్ నేపథ్యంలో తుది జట్టులో కొన్ని మార్పులు చేశాం. మైదానం పెద్దది కావడంతో జయదేవ్ ఉనాద్కత్‌తో పాటు ఎయిడెన్ మార్క్‌రమ్‌ను తుది జట్టులోకి తీసుకున్నాం.'అని ప్యాట్ కమిన్స్ తెలిపాడు.

తుది జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనాద్కత్, టీ నటరాజన్

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లేర్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పోవెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆవేశ్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

Story first published: Friday, May 24, 2024, 19:24 [IST]
Other articles published on May 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+