For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Pat Cummins: అతని వల్లే ఈ విజయం!

Pat Cummins, SA vs AUS 2nd semi final: ట్రావిస్ హెడ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతోనే అద్భుత విజయాన్ని అందుకున్నామని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా సౌతాఫ్రికాతో గురువారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ప్రపంచకప్ చరిత్రలోనే ఆరోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ప్యాట్ కమిన్స్(Pat Cummins).. ట్రావిస్ హెడ్ కారణంగానే గెలిచామని చెప్పాడు. బౌలింగ్‌లో కీలక వికెట్ తీయడంతో పాటు బ్యాటింగ్‌లో అదిరిపోయే ఆరంభాన్ని అందించాడని కొనియాడాడు. ప్రపంచకప్ ఫైనల్ చేరడం చాలా సంతోషంగా ఉందని చెప్పిన కమిన్స్.. భారత్‌తో ఆడనుండటం మరింత స్పెషల్ అని చెప్పుకొచ్చాడు.

Pat Cummins, SA vs AUS 2nd semi final

'డగౌట్‌లో కూర్చోని టెన్షన్ పడటం కంటే బ్యాటింగ్‌కు వచ్చి విజయలాంఛనాన్ని పూర్తి చేయడమే ఉత్తమం. ఇదో అద్భుతమైన మ్యాచ్. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడం మాకు కలిసొచ్చింది. ఎందుకంటే బంతి పాత బడిన తర్వాత పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుందని భావించాం. కానీ ఆరంభంలోనే పేసర్లకు అడ్వాంటేజ్ ఉంటుందనేది ఊహించలేకపోయాం.

స్టార్క్, జోష్ హజెల్ వుడ్ చెలరేగి వికెట్లు తీస్తారని అస్సలు అనుకోలేదు. మా ఫీల్డింగ్ ఆరంభ మ్యాచ్‌ల్లో దారుణంగా ఉండేది. కానీ ఈ మ్యాచ్‌లో చాలా మెరుగ్గా చేశాం. 37 ఏళ్ల డేవిడ్ వార్నర్ డైవింగ్ చేయడం అద్భుతం. ట్రావిస్ హెడ్ తీసిన వికెట్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. టోర్నీ ఆసాంతం బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. ఇంగ్లీస్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఫైనల్ చేరడం చాలా సంతోషంగా ఉంది.

సానుకూలాంశం ఏంటంటే మా జట్టులో చాలా మందికి ప్రపంచకప్ ఫైనల్ ఆడిన అనుభవం ఉంది. కొందరు 2015 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆడితే మరికొందరు 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడారు. పూర్తిగా భారత అభిమానులతో నిండిపోయే బిగ్గెస్ట్ అహ్మదాబాద్ స్టేడియంలో ఫైనల్ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. 2015 ప్రపంచకప్ ఫైనల్ నా కెరీర్‌కే హైలైట్. భారత్ గడ్డపై ఆ జట్టుతో ఫైనల్ ఆడటం మాకు చాలా ప్రత్యేకత.'అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, November 16, 2023, 23:44 [IST]
Other articles published on Nov 16, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+