Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: చరిత్ర సృష్టించిన పాట్ కమిన్స్.. హార్దిక్ పాండ్యా ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్!

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే కెప్టెన్‌గా అత్యధిక వికెట్లు తీసిన తొలి పేసర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రికార్డ్‌ను కమిన్స్ అధిగమించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పాట్ కమిన్స్(3/28) మూడు వికెట్లతో సత్తా చాటాడు. తద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా 36 మ్యాచ్‌ల్లో 42 వికెట్లు పడగొట్టాడు.

గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా 68 మ్యాచ్‌ల్లో 40 వికెట్లు తీయగా.. అతన్ని తాజా మ్యాచ్‌తో కమిన్స్ అధిగమించాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్ షేన్ వార్న్ అగ్రస్థానంలో ఉన్నారు. స్పిన్నర్ అయిన షేన్ వార్న్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా 55 మ్యాచ్‌ల్లో 58 వికెట్లు తీసారు. ఆర్‌సీబీ కెప్టెన్ అనిల్ కుంబ్లే 26 మ్యాచ్‌ల్లో 30 వికెట్లు తీయగా.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సారథిగా అశ్విన్ 28 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టాడు.

తొలి కెప్టెన్‌గా..

అంతేకాకుండా కెప్టెన్‌గా ఐపీఎల్‌లో అత్యధిక సార్లు మూడు వికెట్ల ఘనతను అందుకున్న బౌలర్‌గానూ కమిన్స్ నిలిచాడు. కెప్టెన్‌గా కమిన్స్‌కు ఇది ఐదోసారి మూడు వికెట్ల ఘనతను అందుకోవడం కాగా.. షేన్ వార్న్ కూడా ఐదుసార్లు కెప్టెన్‌గా ఈ ఫీట్ సాధించారు. అనిల్ కుంబ్లే, హార్దిక్ పాండ్యా, యువరాజ్ సింగ్ మూడేసి సార్లు కెప్టెన్‌గా మూడు వికెట్ల ఘనతను అందుకొని తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు.

Pat Cummins Scripts History Equals Shane Warne and Breaks Hardik Pandya s Record with a Stunning Captaincy Feat

చెన్నై సూపర్ కింగ్స్‌పై మూడు వికెట్ల ఘనతను అందుకున్న తొలి పేస్ బౌలింగ్ కెప్టెన్‌గా కూడా కమిన్స్ నిలిచాడు. రవిచంద్రన్ అశ్విన్ తర్వాత సీఎస్‌కేపై అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేసిన బౌలింగ్ కెప్టెన్‌గా కూడా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో అశ్విన్, కమిన్స్ మాత్రమే కెప్టెన్‌గా చెన్నైపై మూడు వికెట్లు ఘనతను అందుకున్నారు.

సీఎస్‌కే 180/7

పాట్ కమిన్స్(3/28), సాకిబ్ హుస్సేన్(2/34) సత్తా చాటడంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల‌కు 180 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్(27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44), కార్తీక్ శర్మ(19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో కమిన్స్ మూడు వికెట్లు తీయగా.. సాకిబ్ హుస్సేన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రఫుల్ హింగే, ఇషాన్ మలింగలకు చెరో వికెట్ దక్కింది.

Story first published: Monday, May 18, 2026, 22:58 [IST]
Other articles published on May 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+