For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Pat Cummins: అతని వల్లే ఈ విజయం

AUS vs PAK: మార్నస్ లబుషేన్ అద్భుత ఫీల్డింగ్‌తోనే ఓడిపోయే మ్యాచ్‌లో విజయం సాధించామని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో అసాధారణ ఫీల్డింగ్‌తో ఆస్ట్రేలియా ఓటమిని తప్పించుకుంది.

ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన ప్యాట్ కమిన్స్.. ఇదో అద్భుతమైన మ్యాచ్ అని, విజయం సాధించడం సంతోషంగా ఉందని తెలిపాడు. 'ఈ మ్యాచ్‌ అద్భుతం. జీవితాంతం గుర్తిండిపోయే మ్యాచ్ ఇది. క్రికెట్‌కే బ్రాండ్ అంబాసిడర్ లాంటి గేమ్. మా ఓపెనర్లు అద్భుతమైన భాగస్వామ్యాన్ని అందించారు. వారు ఆడిన తీరును వ్యక్తిగతంగా నేను బాగా ఆస్వాదించాను.

Pat Cummins credits Marnus Labuschagne for his exceptional fielding skills after AUS beat NZ in CWC 23

ముఖ్యంగా ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. జట్టు నుంచి మేం ఆశించింది ఇదే. చివరి వరకు విజయం కోసం పోరాడిన తీరు అద్భుతం. బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్‌పై మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసారు. పగుళ్లను ఉపయోగించుకొని కట్టు దిట్టంగా బంతులు వేసారు.

అయితే ప్రత్యర్థి బ్యాటర్లు భాగస్వామ్యంతో మేం ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. కానీ ఫీల్డింగ్‌లో మార్నస్ లబుషేన్ అద్భుతం చేశాడు. అతనే కాదు ఇతర ఆటగాళ్లు సైతం అసాధారణ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నారు. ఈ మైదానంలో ఫీల్డింగ్ చేయడం ఆశామాషి వ్యవహారం కాదు. ఫీల్డింగ్‌కు ఏ మాత్రం అనుకూలంగా లేని గ్రౌండ్.

తదుపరి మ్యాచ్‌కు మాకు కాస్త విరామం లభించింది. ఈ సమయాన్ని ఆస్వాదించి తదుపరి మ్యాచ్‌ బరిలోకి దిగుతాం.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 పరుగులకు కుప్పకూలింది. ట్రావిస్ హెడ్(67 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్‌లతో 109) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. డేవిడ్ వార్నర్(65 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 81) హాఫ్ సెంచరీతో రాణించాడు. గ్లేన్ మ్యాక్స్‌వెల్(24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), ప్యాట్ కమిన్స్(14 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 37) మెరుపులు మెరిపించారు.

న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్(3/77), గ్లేన్ ఫిలిప్స్(3/37) మూడేసి వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్(2/80) రెండు వికెట్లు పడగొట్టాడు. మ్యాట్ హెన్రీ, జేమ్స్ నీషమ్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 383 పరుగులే చేసి ఓటమిపాలైంది. రచిన్ రవీంద్ర(89 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 116) శతక్కొట్టగా.. డారిల్ మిచెల్(51 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 54), జేమ్స్ నీషమ్(39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.

Story first published: Saturday, October 28, 2023, 20:26 [IST]
Other articles published on Oct 28, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+