Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ భాగస్వామ్యం వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాం: పాట్ కమిన్స్

హెన్రీచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ మూడో వికెట్‌కు నెలకొల్పిన 75 పరుగుల భాగస్వామ్యంతోనే విజయం సాధించామని సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ కూడా కొంత వరకు కెప్టెన్సీ చేశాడని, ఈ గెలుపు క్రెడిట్ అతనికే దక్కుతుందని చెప్పాడు.

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో చెపాక్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన SRH ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ విజయానంతరం మాట్లాడిన పాట్ కమిన్స్.. ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్‌లపై ప్రశంసల జల్లు కురిపించాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై అసాధారణ ప్రదర్శన కనబర్చారని కొనియాడాడు.

IPL 2026: కావ్య మారన్‌కు బిగ్ షాక్.. SRH vs RCB మ్యాచ్ బాయ్‌కాట్!

IPL 2026: కావ్య మారన్‌కు బిగ్ షాక్.. SRH vs RCB మ్యాచ్ బాయ్‌కాట్!

ఆ ఇద్దరే గెలిపించారు..

' ఈ విజయం చాలా సంతృప్తిని ఇచ్చింది. మేం సాధారణంగా ఆడే విధానానికి ఈ మ్యాచ్ కొంచెం భిన్నంగా సాగింది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు కష్టంగా ఉంది. క్లాసెన్, ఇషాన్ కిషన్ అసాధారణమైన బ్యాటింగ్‌తో గెలిపించారు. వారి ప్రదర్శన చాలా సంతోషాన్నిచ్చింది. ఇషాన్, క్లాసెన్ అద్భుతమైన భాగస్వామ్యమే మా విజయానికి బాటలు వేసింది.

Pat Cummins Applauds Ishan Kishan and Heinrich Klaasen for Mastering Tough Chase Against CSK
Photo Credit: screen grab for JioHotstar

ఎందుకంటే పిచ్ బ్యాటింగ్‌కు కష్టంగా ఉంది. మాకు 1-2 భాగస్వామ్యాలు అవసరమని మేం భావించాం.
ఈ పిచ్‌పై కాస్త సెట్ అయిన తర్వాత బ్యాటింగ్ చేయడం కొంచెం సులువవుతుంది. మొదట్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. కానీ ఇషాన్-క్లాసెన్ సరైన బౌలర్లను టార్గెట్ చేసుకుని కొన్ని అద్భుతమైన షాట్లు ఆడారు. ఈ రన్ ఛేజ్‌లో బాధ్యతాయుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చారు.

గుడ్డిగా ఆడొద్దని డిసైడ్ అయ్యాం..

గత మ్యాచ్‌లో 86 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత మా బ్యాటింగ్ గురించి చర్చించాం. మేం బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌కు అంతగా పేరుగాంచలేదు. కానీ అవసరమైనప్పుడు ఆడగలమని నిరూపించాం. అయితే మా బౌలింగ్ సమయంలోనే పిచ్ కాస్త స్లోగా ఉందని, తక్కువ ఎత్తులో బంతి వస్తున్నట్లు గమనించాం. పిచ్‌పై బంతి ఆగుతూ వచ్చినట్లు కూడా అనిపించింది. దాంతో క్రీజులోకి వెళ్లి గుడ్డిగా బ్యాటింగ్ చేయవద్దని మేం నిర్ణయించుకున్నాం. మా బ్యాటర్లు అద్భుతంగా ఆడారు.

ఈ పిచ్‌పై 180 పరుగులు మంచి స్కోరే. కానీ 1-2 భాగస్వామ్యాలపైనే విజయవకాశాలు అధారపడి ఉంటాయి. టాస్ గురించి మేం పట్టించుకోలేదు. ఇక్కడ ఛేజింగ్ చేసిన టీమ్స్ కూడా గెలిచాయని గుర్తించాం. ప్లే ఆఫ్స్ చేరినా టాప్-2లో నిలిచేందుకు ప్రయత్నిస్తాం. ఆఖరి మ్యాచ్‌లో విజయం కోసం మా సాయశక్తులా పోరాడుతాం.

అసలు ఆట ఇప్పుడే..

అసలైన ఆట ఇప్పుడు మొదలవుతుంది. కాబట్టి జట్టుగా మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఇషాన్ కిషన్ కూడా ఈ మ్యాచ్‌లో సగం వరకు కెప్టెన్సీ చేశాడు. కాబట్టి ఈ విజయంలో అతనికి మరింత క్రెడిట్ దక్కాలి. మా జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉంది.

గెలిచినా.. మెరుగుపర్చుకునే విషయాలు ఎప్పుడూ కొన్ని ఉంటాయి. మేం లైన్ అండ్ లెంగ్త్ కొద్దిగా తప్పిన ఒకట్రెండు ఓవర్లు ఉన్నాయి. పిచ్ పరిస్థితులను మేం ఇంకాస్త వేగంగా అంచనా వేసి ఉండాల్సింది. కానీ మొత్తంగా చూసుకుంటే.. ఈ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను.'అని పాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ చరిత్రలోనే 'వన్ సీజన్ వండర్స్' ఎవరంటే?

ఐపీఎల్ చరిత్రలోనే 'వన్ సీజన్ వండర్స్' ఎవరంటే?
Story first published: Tuesday, May 19, 2026, 0:55 [IST]
Other articles published on May 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+