Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Parthiv Patel: అదే టీమిండియా సక్సెస్ సీక్రెట్!

 Parthiv Patel says One can’t speak English, one can’t speak Hindi but they get along really well

న్యూఢిల్లీ: టీమిండియా సక్సెస్ సీక్రెట్ ఆటగాళ్ల మధ్య ఉన్న ఐక్యతేనని మాజీ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ పార్దీవ్ పటేల్ అన్నాడు. భిన్న ప్రాంతాల నుంచి వచ్చినా, వేర్వేరు భాషాలు మాట్లాడుతున్నా.. విభిన్నమైన మనస్థత్వాలు కలిగి ఉన్నా అందరూ ఒకే లక్ష్యం కోసం కలిసికట్టుగా పనిచేస్తున్నారని, అదే జట్టుకు విజయాలందిస్తుందని తెలిపాడు. తాజాగా పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'ఒకసారి టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌ చూడండి. విరాట్‌ కోహ్లీతో కలిసి ఇషాంత్‌ శర్మ తిరుగుతున్నాడు. అతడే ఉమేశ్‌ యాదవ్‌తో తిరగడమూ మనం చూశాం. వారిద్దరివీ వేర్వేరు మనస్తత్వాలు కానీ కలిసే తిరుగుతున్నారు. హార్దిక్ పాండ్యతో కలిసి రిషభ్ పంత్‌ బయటికి వెళ్లాడు. అందులో ఒకరిది పశ్చిమ భారత దేశం. మరొకరిది ఉత్తర భారత దేశం. తూర్పు నుంచీ కొందరు ఉన్నారు. మీరు దినేశ్‌ కార్తీక్‌, కృనాల్‌, హార్దిక్‌ను చూడండి. వారు మంచి మిత్రులు. ఒకరికి ఇంగ్లీష్‌ రాదు. మరొకరికి హిందీ రాదు. అయినా వారి స్నేహం బలంగా ఉంది. టీమిండియా ఈ తరంలో ఎందుకింత బాగా ఆడుతోందంటే కారణం ఇదే. వారంతా కలిసికట్టుగా ఉన్నారు. ఐపీఎల్‌ సైతం ఇందుకు దోహదం చేసింది.' అని పార్థివ్‌ పటేల్ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు జోరు మీదుంది. లార్డ్స్ టెస్ట్‌లో 151 పరుగులతో ఆతిథ్య జట్టును చిత్తు చేసి చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఫలితంగా ఐదు టెస్టుల సిరీసులో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. వర్షం కారణంగా మొదటి టెస్టును డ్రా చేసుకున్న కోహ్లీ సేన రెండో టెస్టులో అద్వితీయమైన విజయం అందుకుంది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌ కలిసి రాణించారు. ఆఖరి రోజు భారత పేసర్లు ఆంగ్లేయులను కేవలం 60 ఓవర్లలోపే ఆలౌట్‌ చేసి విజయం అందించడం ప్రత్యేకం. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ లీడ్స్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభం కానుంది.

ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే భారత తుది జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ జట్టులోకి రానున్నాడు. లీడ్స్ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ మార్పు జరగనుంది. అంతేకాకుండా మరో స్పిన్నర్ జడేజా బౌలింగ్ తేలిపోవడంతో అశ్విన్ తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. స్పిన్నర్ల విషయం మినహా.. లీడ్స్‌ టెస్ట్ మ్యాచుకు భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ మంచి ఫామ్ మీదున్నారు. విమర్శలపాలైన చతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలు కూడా గాడిలో పడ్డారు. ఇక విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. వీరు కూడా పరుగులు చేస్తే.. ఇంగ్లండ్ జట్టుకు తిప్పలుతప్పకపోవచ్చు. పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ సూపర్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

Story first published: Saturday, August 21, 2021, 19:00 [IST]
Other articles published on Aug 21, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+