ఆ తప్పిదాల కారణంగానే కోహ్లీ కెప్టెన్సీలో ప్రపంచకప్ రాలేదు: పార్థీవ్ పటేల్

న్యూఢిల్లీ: వ్యూహాత్మక తప్పిదాలతోనే విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఐసీసీ టైటిల్ అందుకోలేకపోయిందని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ అన్నాడు. 2019 ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమితో పాటు 2021 టీ20 ప్రపంచకప్ వైఫల్యం, 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఓటమికి టీమ్‌మేనేజ్‌మెంట్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు. అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్, ఆసియాకప్ నేపథ్యంలో క్రిక్ బజ్‌తో మాట్లాడిన పార్థీవ్ పటేల్.. మెగాటోర్నీల్లో అనుసరించే వ్యూహాలు చాలా కీలకమని చెప్పాడు.

ధోనీని లోయరార్డర్‌లో పంపించి..
2019 ప్రపంచకప్ సెమీఫైనల్లో మహేంద్ర సింగ్ ధోనీనీ లోయరార్డర్‌లో పంపించి ఘోర తప్పిదం చేసిందన్నాడు. ఆ కారణంతోనే ఆ మ్యాచ్‌లో భారత్ గెలవలేకపోయిందన్నాడు. ‘2019 ప్రపంచకప్ సెమీఫైనల్లో దినేశ్ కార్తీక్‌ను ఐదో స్థానంలో పంపించి ధోనీని ఏడో స్థానంలో ఆడించడం దెబ్బతీసింది. ధోనీని డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంచి మ్యాచ్ గెలుస్తుందని ఎలా అనుకున్నారో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. ఇక సరైన టీమ్‌ను కూడా ఎంపిక చేయలేకపోయారు. నాలుగో స్థానంలో ఆడే బ్యాటర్ ఎవరో గుర్తించలేకపోయారు.'అని పార్థీవ్ చెప్పుకొచ్చాడు.


చాహల్‌ను తీసుకోకుండా..
గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో యుజ్వేంద్ర చాహల్‌ను జట్టులోకి తీసుకోకుండా మూల్యం చెల్లించుకున్నారని పార్దీవ్ అభిప్రాయపడ్డాడు. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం దెబ్బతీసిందన్నాడు. ‘2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా వ్యూహాత్మకంగా తప్పిదం చేసింది. బ్యాటింగ్ అనుకూలించే వికెట్‌పై టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో నెంబర్ వన్ స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్‌ను పక్కనపెట్టేసింది. ఇటీవల చాహల్ ఆడుతున్న విధానం చూస్తే ఎంత తప్పిదం చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చెత్త నిర్ణయాల వల్లనే భారత్ ఐసీసీ టైటిళ్లు అందుకోలేకపోయింది.'అని పార్దీవ్ చెప్పుకొచ్చాడు.

9 ఏళ్లుగా టైటిల్ లేదు.
.
చివరి సారిగా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియా 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలుపొందింది. ఆ విజయానంతరం భారత్ మరే ఐసీసీ టైటిల్ గెలవలేదు. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినా ఐసీసీ టోర్నీల్లో విఫలమైంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో రికార్డు విజయాలు నమోదు చేసిన భారత్.. కీలక టోర్నీల్లో మాత్రం వ్యూహాత్మక తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. ఈ కారణంగానే కోహ్లీ సైతం కెప్టెన్సీ కోల్పోయాడు. అయితే రోహిత్ సారథ్యంలోనైనా భారత్ 2022 టీ20 ప్రపంచకప్ గెలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications