For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఆస్ట్రేలియా క్రికెటర్ నా ముఖం పగలకొడతానని హెచ్చరించాడు: పార్దీవ్

Parthiv Patel Recalls A Sledging Incident Involving Matthew Hayden

న్యూఢిల్లీ: అతి పిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన భారత వెటరన్ వికెట్ కీపర్ పార్దీవ్ పటేల్ ప్రత్యర్థి ఆటగాళ్లపై స్లెడ్జింగ్ దిగడంలో దిట్టా. కెరీర్ ప్రారంభంలోనే ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ స్టీవ్ వా‌పై నోరుపారేసుకొని అతనితో చివాట్లు తిన్నాడు. 'నువ్వు డైపర్‌లు వేసుకునే వయసులోనే నేను అంతర్జాతీయ క్రికెట్‌లో మ్యాచ్‌లు ఆడటం ప్రారంభించాను. ఇప్పుడు నువ్వు నన్ను స్లెడ్జింగ్ చేస్తున్నావా..?'అని పార్దీవ్‌కు స్టీవ్ వా గట్టిగానే బుద్ది చెప్పాడు.

అయినా తీరు మార్చుకొని పార్దీవ్.. అదే పర్యటనలో మాథ్యూ హెడెన్‌‌పై కూడా స్లెడ్జింగ్ దిగి తిట్లుతిన్నానని తాజాగా చెప్పుకొచ్చాడు. ఫీవర్ నెట్‌వర్క్ 100 అవర్స్ 100 స్టార్స్ కార్యమ్రంలో పాల్గొన్న ఈ గుజరాత్ ప్లేయర్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

హోహో.. అంటూ వెక్కిరించా..

హోహో.. అంటూ వెక్కిరించా..

2004 టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో బ్రిస్బేన్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో హెడెన్‌పై స్లెడ్జింగ్‌కు దిగినట్లు పార్థీవ్ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో వీవీఎస్ లక్ష్మణ్(103) సూపర్ సెంచరీతో భారత్ 303 పరుగుల భారీ లక్ష్యం చేసిందన్నాడు. అనంతరం చేధనకు దిగిన ఆసీస్.. మాథ్యుహెడెన్ (109) సెంచరీతో ఓ దశలో ఓటమి దిశగా పయనించిందని, కానీ ఇర్ఫాన్ పఠాన్ అద్భుత బంతితో హెడెన్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేర్చాడన్నాడు. ఆ మ్యాచ్‌తో తాను 12వ ఆటగాడిగా డ్రింక్స్ అందిస్తున్నానని, ఔటై వెళ్తున్న హెడన్‌ను కవ్వించానని పార్దీవ్ గుర్తుచేసుకున్నాడు.

 ముఖం పగలకొడ్తానన్నాడు..

ముఖం పగలకొడ్తానన్నాడు..

‘బ్రిస్బేన్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో నేను ఆటగాళ్లకు డ్రింక్స్ అందించాను. ఆ మ్యాచ్‌లో శతకం బాదిన మాథ్యూ హెడెన్‌ కీలక సమయంలో ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. అతను పెవిలియన్‌కి వెళ్తుండగా.. నేను మైదానంలోకి డ్రింక్స్ తీసుకుని వెళ్తూ ‘హో హో' అంటూ అతడిని కవ్వించాను. అప్పుడు మౌనంగా ఉండిపోయిన హెడెన్.. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూము వద్ద నిల్చొని ‘ఇంకోసారి అలా చేస్తే.. నీ ముఖం పగలగొడతా'అని వార్నింగ్ ఇచ్చాడు. దాంతో.. నేనుఅతనికి క్షమాపణలు చెప్పాను'అని పార్థీవ్ వెల్లడించాడు.

తర్వాత మంచి ఫ్రెండ్స్ అయ్యాం..

తర్వాత మంచి ఫ్రెండ్స్ అయ్యాం..

అనంతరం ఈ ఇద్దరు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడారు. ఓపెనర్లుగా కూడా బరిలోకి దిగారు. అప్పుడే వారి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని పార్ధీవ్ చెప్పుకొచ్చాడు. ‘బ్రిస్బెన్‌లో హెడెన్ నన్న కొట్టాలనుకున్నాడు. కానీ ఆ తర్వాత మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. మేమిద్దం కలిసి చెన్నై తరఫున చాలా క్రికెట్ ఆడాం. క్రీజులో ఒకరికొకరం అండగా ఉంటూ ఆటను ఆస్వాదించాం. అతనితో ఓపెనింగ్ చాలా సరదాగా ఉండేది. మైదానం బయట కూడా అలానే ఉండేవాళ్లం. బ్రిస్బెన్ ఘటనను అప్పుడే మరిచిపోయాం. ఓ సారి ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు హెడెన్ తన ఇంటికి కూడా ఆహ్వానించాడు. నాకోసం ప్రత్యేకంగా చికెన్ బిర్యానీ, పప్పు వండాడు'అని పార్ధీవ్ గుర్తుచేసుకున్నాడు.

బ్రిస్బెన్ వన్డేలో భారత్ గెలుపు..

బ్రిస్బెన్ వన్డేలో భారత్ గెలుపు..

ఇక నాటి బ్రిస్బెన్ వన్డేలో భారత్ 19 పరుగులతో గెలుపొందింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 303 పరుగులు చేసింది. లక్ష్మణ్(103), సచిన్ (86) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన ఆసీస్.. ఇర్ఫాన్ పఠాన్(3/64), బాలాజీ(4/48) ధాటికి 49.4 ఓవర్లలో 284 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఈ విజయానంతరం వన్డేల్లో ఆసీస్‌ను ఓడించేందుకు భారత్‌కు మూడేళ్ల సమయం పట్టింది.

Story first published: Thursday, May 7, 2020, 13:48 [IST]
Other articles published on May 7, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+