Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: ఆ ఇద్దరు పేసర్లలో ఒకరికే ఛాన్స్.. అశ్విన్, చక్రవర్తిలకు షాక్! పాక్‌తో బరిలోకి దిగే భారత జట్టు ఇదే!

Parthiv Patel Picks his India Playing XI for Pakistan Clash, No Ashwin and Varun Chakravarthy

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌ 2021 శనివారం (అక్టోబర్ 23) ఆరంభం కానుంది. ఈ నెల 24న టీమిండియా.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనున్న విషయం తెలిసిందే. దుబాయ్ అంతర్జాతీయ మైదానంలో ఆదివారం రాత్రి 7.30 గంటలకు దాయాది దేశాల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులతో పాటు మాజీలు కూడా ఎందరో వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. భారత్-పాక్ మ్యాచుకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో మాజీలు తమ తమ అభిప్రాయాలు, సూచనలు ఇస్తున్నారు. కొందరు తమ ప్లేయింగ్ లెవెన్‌ను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ పాక్‌తో బరిలోకి దిగే తన భారత జట్టును ఎంచుకున్నాడు.

అశ్విన్, చక్రవర్తిలకు షాక్

అశ్విన్, చక్రవర్తిలకు షాక్

భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే హై వోల్టేజీ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్న టీమిండియాను తన అంచనాతో పార్థివ్‌ పటేల్‌ ఎంపిక చేశాడు. అయితే తన అంచనా ప్రకారం.. భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్‌లలో ఒకరినే తుది జట్టులోకి తీసుకునే అవకాశముందని పేర్కొన్నాడు.

దాంతో పాటు ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో అదరగొట్టిన యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌కి తను అంచనా వేసిన జట్టులో చోటు కల్పించలేదు. ఐపీఎల్ 2021లో రాణించిన వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలకు కూడా పార్థివ్ తన జట్టులో చోటివ్వలేదు. ఈ ఇద్దరి కాకుండా రాహుల్ చహర్‌కు అతడు ఛాన్స్ ఇచ్చాడు.

ఆ ఇద్దరిలో ఒకరికే ఛాన్స్‌

ఆ ఇద్దరిలో ఒకరికే ఛాన్స్‌

స్టార్ స్పోర్ట్స్‌ షోలో పార్థివ్‌ పటేల్‌ మాట్లాడుతూ... 'టీ20 ప్రపంచకప్‌లో భారత్ బలమైన బ్యాటింగ్‌ లైనప్‌తో బరిలోకి దిగుతుంది. తుది జట్టు కూర్పు ఎలా ఉంటే సత్ఫలితాలు వస్తాయో కెప్టెన్ విరాట్ కోహ్లీకి బాగా తెలుసు. నా అంచనా ప్రకారం భువనేశ్వర్‌ కుమార్‌, శార్దూల్ ఠాకూర్‌ ఇద్దరిలో ఒకరికే తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

రోహిత్‌ శర్మతో కేఎల్ రాహుల్‌ ఇన్నింగ్స్‌ని ఆరంభించే అవకాశం ఉంది. విరాట్‌ కోహ్లీ మూడు, సూర్యకుమార్ యాదవ్‌ నాలుగు, రిషబ్ పంత్‌ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతారు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ చేయకున్నా.. ఫినిషర్‌ అవసరం ఉంది కాబట్టి ఆరో స్థానంలో ఆడాలి.

రవీంద్ర జడేజా, రాహుల్ చహర్‌, మహమ్మద్‌ షమీ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌/శార్దూల్ ఠాకూర్‌లలో తుది జట్టులో ఎవరికి చోటు దక్కితే వారు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వస్తారు' అని అన్నాడు.

T20 World Cup 2021: వెస్టిండీస్‌తో మ్యాచ్.. ప్రపంచ నంబర్ వన్‌కు షాక్ ఇవ్వనున్న ఇంగ్లండ్!!

ఛాంపియన్స్‌ ట్రోఫీ మినహా

ఛాంపియన్స్‌ ట్రోఫీ మినహా

గ్రూప్ 2లో భాగంగా అక్టోబ‌ర్ 24న భారత్, పాకిస్థాన్ మ‌ధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత దాయాది జట్లు మరోసారి తలపడనున్నాయి. దాంతో ఈ మ్యాచుపై అందరిలో ఆసక్తి నెలకొంది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ఇరు జట్ల మధ్య ధ్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే దాయాదీ జట్లు తలపడుతున్నాయి.

చివరగా 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం భారత్‌లో పాక్‌ పర్యటించింది. 2008లో ఆసియా కప్‌ కోసం టీమిండియా.. పాక్‌కు వెళ్లింది. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాను పాకిస్తాన్ ఓడించింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత ఆ జట్టు భారత్‌తో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైన విషయం తెలిసిందే. 2018 ఆసియా కప్‌, 2019 వన్డే ప్రపంచకప్‌ పోరులో దాయాది దేశం పరాజయం పాలయ్యింది

పాక్‌తో బరిలోకి దిగే పార్థివ్ పటేల్ భారత జట్టు ఇదే

పాక్‌తో బరిలోకి దిగే పార్థివ్ పటేల్ భారత జట్టు ఇదే

రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్‌, రిషబ్ పంత్‌ (కీపర్), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చహర్‌, మహమ్మద్‌ షమీ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌/శార్దూల్ ఠాకూర్‌.

Story first published: Thursday, October 21, 2021, 13:26 [IST]
Other articles published on Oct 21, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+