Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Oympics 2024: రోడ్డెక్కిన రెజ్లర్లు.. పోడియం ఎక్కుతారా?

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై అగ్రశ్రేణి రెజ్లర్ల ఉద్యమం చేపట్టడంతో దేశంలో రెజ్లింగ్ కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. ట్రయల్స్ లేవు.. పోటీలు లేవు. మరోవైపు అంతర్జాతీయ పోటీల బహిష్కరణ. దాదాపు ఏడాది పాటు ఇదే పరిస్థితి నెలకొంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అగ్రశ్రేణి రెజ్లర్లు సుదీర్ఘ కాలం పాటు ఆందోళనలను కొనసాగించారు.

కానీ పారిస్ ఒలింపిక్స్ 2024 నేపథ్యంలో రెజ్లర్ల ఫోకస్ మ్యాట్ మీదకు మళ్లుతోంది. ఆటల సంగ్రామానికి దగ్గర పడుతుండటంతో రెజ్లింగ్‌లో వచ్చే మెడల్స్‌పై చర్చ సాగుతోంది. ఒలింపిక్స్‌లో ప్రతీసారి దేశానికి పతకాలు అందించడంలో ముందుండే రెజ్లర్లు ఈసారి కూడా అంచనాలు పెంచేస్తున్నారు. వినేశ్ ఫొగాట్, అంతిమ్ పంగాల్, అన్షు మాలిక్, అమన్ సెహ్రావత్ మెడల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నారు.

Paris Oympics 2024 How many medals have Indian wrestlers won in Olympics after sex harassment scandal

ఆ ఇద్దరికీ నో ఛాన్స్..
ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో దేశానికి పతకాలు అందించే క్రీడాంశాల్లో రెజ్లింగ్ ప్రధానమైనది. ఇప్పటి వరకూ రెజ్లింగ్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు, ఐదు కాంస్యాలు దక్కాయి. 2008 నుంచి కనీసం ఒక పతకమైనా ఖాతాలో చేరుతోంది. టోక్యో ఒలింపిక్స్‌లో రవి దహియా సిల్వర్, బజ్‌రంగ్ బ్రాంజ్ మెడల్ సాధించారు. అయితే పారిస్ ఒలింపిక్స్‌కు ఈ ఇద్దరూ అర్హత సాధించలేదు.

ఈ సారి మొత్తం ఆరుగురు భారత రెజ్లర్లు పతకాలు సాధించేందుకు సిద్ధమవుతున్నారు. హరియాణాకే చెందిన రీతిక హుడా(76), నిషా దహియా(68), అన్షు మలిక్(57), అమన్ సెహ్రావత్ (57), అంతిమ్ పంగాల్(53), వినేశ్ ఫొగాట్(50 కేజీలు) తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

ఒకే ఒక్కడు..
పురుషుల రెజ్లింగ్‌లో ఈసారి భారత్‌ నుంచి అమన్ సెహ్రావత్ మాత్రమే బరిలో నిలిచాడు. 20 ఏళ్లకే అంతర్జాతీయ స్థాయిలో లెక్కకు మించిన పతకాలు సాధించిన అతను ఒలింపిక్ మెడల్ సాధిస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వినేశ్ ఫొగాట్‌పై ఆశలు..
బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో వినేశ్ ఫొగాట్ కీలక పాత్ర పోషించింది. దాంతో ఆమె కెరీర్ ముగిసినట్లేనని అంతా అనుకున్నారు. ఓ దశలో ఆమె తన అవార్డులను కూడా తిరిగిచ్చేసింది. ఆ తర్వాత మోకాలికి సర్జరీ చేయించుకుంది. మరోవైపు 53 కేజీల విభాగంలో అంతిమ్ అర్హత సాధించడంతో వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్ ఆడటం కష్టమని అంతా అనుకున్నారు.

కానీ ఆమె ఈ ప్రతికూలతల నుంచి అద్భుత ప్రదర్శనతో పారిస్ బెర్త్‌ను దక్కించుకుంది. 53 నుంచి 50 కేజీలకు మారిన ఆమె.. ఒలింపిక్ మెడల్‌ ఫేవరేట‌గా బరిలోకి దిగుతోంది. 2016 రియో ఒలింపిక్స్‌లో గాయంతో తప్పుకున్న ఆమె.. టోక్యో ఒలింపిక్స్‌లో అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సారి మాత్రం ఒలింపిక్ మెడల్ కలను సాకారం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.

Story first published: Friday, July 12, 2024, 8:19 [IST]
Other articles published on Jul 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+