Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Olympics 2024: భారత అథ్లెట్ల జాబితా ఇదే!

యావత్ క్రీడా ప్రపంచం ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూసే పారిస్ ఒలింపిక్స్ 2024కు రంగం సిద్దమైంది. మరో 17 రోజుల్లో ఈ వరల్డ్ బిగ్గెస్ట్ ఈవెంట్‌కు తెరలేవనుంది. జూలై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో మొత్తం 32 క్రీడల్లో 329 ఈవెంట్స్‌ల్లో అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

భారత్‌ నుంచి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అథ్లెట్లు మొత్తం 16 క్రీడల్లో పోటీ పడనున్నారు. అచంట శరత్, పీవీ సింధులు ఆరంభ వేడుకల్లో భారత బృందానికి ఫ్లాగ్ బెరర్‌గా వ్యవహరించనున్నారు. 1920 నుంచి భారత అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పోటీపడుతున్నారు. గత టోక్యో ఒలింపిక్స్‌లో 124 మంది భారత అథ్లెట్లు బరిలోకి దిగగా.. ఈ సంఖ్య ఈసారి 111కు పడిపోయింది. క్రీడల సంఖ్య కూడా 18 నుంచి 16కు పడిపోయింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్ ఈవెంట్లలో అర్హత సాధించిన భారత ప్లేయర్లు.. ఈ సారి క్వాలిఫై కాలేకపోయారు.

Paris Olympics 2024 Complete list of qualified Indian athletes

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ 7 పతకాలు సాధించింది. ఇందులో నీరజ్ చోప్రా బంగారు పతకం ఉండగా.. మీరాభాయి చాను, రవికుమార్ దహియా రజత పతకాలు సాధించింది. పీవీ సింధు, లోవ్లీనా బోర్గోహైన్, బజరంగ్ పూనియా‌లు కాంస్య పతకాలు సాధించారు.

పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత అథ్లెట్లు:

1. అథ్లెటిక్స్
ఆకాశ్‌దీప్ సింగ్-పురుషుల 20కిలోమీటర్ల నడక రేసు

ప్రియాంక గోస్వామి-మహిళల 20కిలోమీటర్ల నడక రేసు

వికాస్ సింగ్- పురుషుల 20కిలోమీటర్ల నడక రేసు

పరమ్‌జీత్ బిష్త్-పురుషుల 20కిలోమీటర్ల నడక రేసు

మురళీ శ్రీశంకర్- పురుషుల లాంగ్‌ జంప్

అవినాష్ సబ్లే-పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్

నీరజ్ చోప్రా- పురుషుల జావెలిన్ త్రో

పారుల్ చౌదరి- మహిళల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్

కిషోర్ జెనా- పురుషుల జావెలిన్ త్రో

రామ్ బాబు- పురుషుల 20 మీటర్ల రేస్ వాక్

ప్రియాంక గోస్వామి/అర్ష్‌దీప్ సింగ్-మారథాన్ రేస్ వాక్ మిక్స్‌డ్ రిలే

ముషమ్మద్ అనాస్/ ముహమ్మద్ అజ్మల్/అరోకియా/అమోజ్ జకోబ్- పురుషుల 4X100 మీటర్ల రిలే

రుపాల్/జ్యోతిక/పూవమ్మ/ సుభా వెంకటేషన్- మహిళల 4X400 మీటర్ల రిలే

కిరణ్ పహల్- మహిళల 400 మీటర్లు

2. ఆర్చరీ

ధీరజ్ బొమ్మదేవర- పురుషుల వ్యక్తిగత, టీమ్ ఈవెంట్

భజన్ కౌర్- మహిళల వ్యక్తిగత, టీమ్ ఈవెంట్

తరుణ్‌దీప్ రాయ్- పురుషుల వ్యక్తిగత, పురుషుల జట్టు ఈవెంట్

ప్రవీణ్ జాదవ్- పురుషుల వ్యక్తిగత, పురుషుల జట్టు ఈ వెంట్

దీపికా కుమారి- మహిళల వ్యక్తిగత, మహిళల జట్టు ఈ వెంట్

అంకిత భకత్- మహిళల వ్యక్తిగత,మహిళల జట్టు 3, టేబుల్ టెన్నిస్

Story first published: Monday, July 8, 2024, 22:51 [IST]
Other articles published on Jul 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+